News August 23, 2025
MLA కడియం శ్రీహరి జవాబుపై ఉత్కంఠ..!

ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 2023 ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో మాత్రమే BRS గెలిచింది. 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల సమయంలో అనూహ్యంగా స్టేషన్ ఘన్పూర్ MLA కడియం శ్రీహరి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తన కూతురు కావ్యకు కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ తెచ్చుకొని గెలిపించుకున్నారు. ప్రస్తుతం కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు జారీ చేయగా, MLA శ్రీహరి ఎలా బదులిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News January 16, 2026
నేడు ఆవులను ఎలా పూజించాలంటే?

కనుమ రోజున ఆవులను, ఎడ్లను చెరువులు, బావుల వద్దకు తీసుకువెళ్లి శుభ్రంగా స్నానం చేయించాలి. ఆపై వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు, పూలమాలలు వేసి అందంగా అలంకరించాలి. నుదుటన పసుపు, కుంకుమలు పెట్టి హారతి ఇవ్వాలి. కొత్త బియ్యంతో వండిన పొంగలిని లేదా పచ్చగడ్డి, బెల్లం కలిపిన పదార్థాలను నైవేద్యంగా తినిపించాలి. చివరగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం ద్వారా ఆ దేవతల ఆశీస్సులు పొందవచ్చు.
News January 16, 2026
పీరియడ్ పెయిన్స్ తగ్గించే ఫుడ్ ఇదే..

నెలసరి సమయంలో కొందరికి విపరీతంగా కడుపు, నడుంనొప్పి వస్తుంటాయి. వీటిని తగ్గించాలంటే కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. నానబెట్టిన ఎండు ద్రాక్ష, చేమ దుంప, చిలగడదుంప వంటి దుంపజాతి కూరగాయలు తినడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే అరటిపండు, అరటి కాయ, అరటి పువ్వును వంటకాల్లో భాగం చేసుకొని తీసుకోవచ్చు. హార్మోన్లను సమతులంగా ఉంచడంలో అరటి పువ్వు కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు.
News January 16, 2026
చలికాలంలో కోడిపిల్లల పెంపకంలో జాగ్రత్తలు

షెడ్‌లోకి కోడి పిల్లలను వదిలిన తర్వాత ప్రతిరోజూ 2 లేదా 3 సార్లు వాటి ప్రవర్తన, ఆరోగ్యస్థితిని పరిశీలించాలి. చిన్న పిల్లలను పెంచే షెడ్డుకు, పెద్ద కోళ్లను ఉంచే షెడ్‌కు మధ్య కనీసం 100 గజాల దూరం ఉండేలా చూసుకోవాలి. కోడి పిల్లలను ఉంచే షెడ్‌లో లిట్టరు పొడిగా ఉండేట్లు జాగ్రత్తపడాలి. కోడి పిల్లలను పెంచే షెడ్ వైపునకు నాటు కోళ్లను రానీయకూడదు. చలి గాలులు సోకకుండా షెడ్డుకు ఇరువైపులా పరదాలను వేలాడదీయాలి.


