News March 4, 2025

MLC ఎన్నికల్లో తొలిసారి గెలవబోతున్న టీడీపీ

image

గోదావరి గడ్డపై పట్టభద్రుల MLC స్థానంలో టీడీపీ నుంచి తొలి విజయం నమోదు కానుంది. 2007లో శాసన మండలి ఏర్పడ్డాక 2007, 2013, 2019 గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. గత 3 సార్లు పీడీఎఫ్ లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులే గెలుపొందారు. ఇప్పుడు కూటమి బలపర్చిన పేరాబత్తుల రాజశేఖరం విజయం దాదాపు ఖరారు అయింది. ఇప్పటి వరకు ఆయనకు 80,037 ఓట్లు పోలయ్యాయి.

Similar News

News December 17, 2025

అప్పయ్యపల్లి సర్పంచ్‌గా సుప్రియ

image

HNK జిల్లా శాయంపేట మండలం అప్పయ్యపల్లి సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సుప్రియ వినయ్ కుమార్ ఘన విజయం సాధించారు. అప్పయ్యపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సర్పంచ్‌గా సుప్రియ ఎన్నికవడంతో వారి మద్దతుదారులు సంబరాలు జరుపుకొన్నారు.

News December 17, 2025

మేకప్ రోజంతా ఉండాలంటే ఇలా చేయండి

image

మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే ముందుగా చర్మాన్ని శుభ్రం చేసి, టోనర్‌ అప్లై చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఆపై ప్రైమర్ ఉపయోగించాలి. జిడ్డు చర్మం వారు మ్యాటిఫైయింగ్ ఫార్ములాను, చర్మం పొడిగా అనిపిస్తే హైడ్రేటింగ్ ప్రైమర్‌ను వాడాలి. తర్వాత ఫౌండేషన్ అప్లై చేసుకొని మేకప్ సెట్ చేసుకోవాలి. ఇలా చేస్తే రోజంతా మెరిసిపోయే మేకప్ మీ సొంతం అవుతుంది.

News December 17, 2025

చౌటుప్పల్: 11 ఓట్లతో అంజిరెడ్డి గెలుపు

image

చౌటుప్పల్ మండలంలోని మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. చింతలగూడెం గ్రామంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ముసుకు అంజిరెడ్డి 11 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో అంజిరెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.