News November 5, 2025
MNCL: ఈ నెల 9న జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు

కాసిపేట మండలం సోమగుడెం సింగరేణి మైదానంలో ఈ నెల 9న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి సీనియర్ పురుషులు, మహిళల వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ధ్రువపత్రాలతో 9న ఉదయం 9గంటలకు హాజరుకావాలని జిల్లా వాలీబాల్ సంఘం అధ్యక్షుడు నల్ల శంకర్ సూచించారు.
Similar News
News January 23, 2026
కల్తీనెయ్యి.. ఛార్జిషీట్లో కీలక అంశాలు..

తిరుమలకు 2019-24లో కల్తీనెయ్యి సరఫరా అయినా TTD అడ్డుకోలేదని నెల్లూరు కోర్టులో ఇవాళ దాఖలు చేసిన ఫైనల్ ఛార్జిషీట్లో CBI పేర్కొంది. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన నందిని డెయిరీ అంతకుముందు నెయ్యి సరఫరా చేయగా.. తగిన సామర్థ్యం, అనుభవం లేని AR డెయిరీకి టెండర్ దక్కేలా నిబంధనలు మార్చారని ఆరోపించింది. అటు ARకు ఇచ్చినా తెరవెనక భోలేబాబా సబ్ కాంట్రాక్ట్ పొంది నెయ్యి సప్లై చేసిందని దర్యాప్తు సంస్థ తెలిపింది.
News January 23, 2026
ఆదిలాబాద్: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులకు 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ రమేశ్ తెలిపారు. ఆసక్తి గల వారు ఈనెల 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు tsstudycircle.co.in వెబ్‌సైట్ లేదా 9494149416 సంప్రదించవచ్చు. ప్రవేశ పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 23, 2026
కామారెడ్డి పోలీసుల స్పెషల్ డ్రైవ్: 127 ఫోన్లు రికవరీ

కామారెడ్డి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో ఫోన్ల రికవరీలో విశేష ఫలితాలు సాధించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా మొత్తం 127 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేశారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 4,408 మొబైల్ ఫోన్లు రికవరీ చేయగా వాటి విలువ సుమారు రూ.7.05 కోట్లు ఉందన్నారు. గత ఏడాదిలో 1,834 ఫోన్లు (రూ.3 కోట్లు) రికవరీ చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు.


