News August 8, 2024

MNCL: ఏడు నెలల్లో ఆరుగురు కార్మికులు మృతి

image

వరుస ప్రమాదాలు సింగరేణి కార్మికులను కలవరపెడుతున్నాయి. గనుల్లో పకడ్బందీ రక్షణ చర్యలు తీసుకుంటున్నామని యాజమాన్యం చెబుతున్నప్పటికీ ఉద్యోగులు చనిపోవటం, తీవ్రగాయాలపాలవడం ఆందోళన కలిగిస్తోంది. సింగరేణి వ్యాప్తంగా ఈ ఏడాది జులై 31 వరకు 39 ప్రమాదాలు నమోదుకాగా 41 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆరుగురు మృతి చెందారు.

Similar News

News December 11, 2025

ఇచ్చోడ: లక్కీ డ్రాతో సర్పంచ్ ఎన్నిక

image

ఇచ్చోడ మండలం దాబా(బి) గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలవగా, పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 176 ఓట్లు వచ్చాయి. దీంతో లక్కీ డ్రా ద్వారా ఈశ్వర్‌ను సర్పంచ్‌గా ప్రకటించారు. ఈ విధంగా లక్కీ డ్రా ద్వారా విజేత ఎన్నికవడం ఉత్కంఠను రేపింది.

News December 11, 2025

ఉట్నూర్: భార్య సర్పంచ్, భర్త ఉపసర్పంచ్

image

ఉట్నూర్ మండలం లింగోజితండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి జాదవ్ మాయ.. సమీప ప్రత్యర్థి విమలపై 88 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా ఆమె భర్త హరినాయక్ వార్డ్ మెంబర్‌గా గెలుపొంది ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఒకే ఇంట్లో రెండు పదవులు రావడంతో వారి మద్దతుదారులు సంబరాలు మొదలుపెట్టారు.

News December 11, 2025

ఆదిలాబాద్ జిల్లాలో మహిళదే విజయం

image

ఇచ్చోడ మండల పరిధిలోని 28 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని హీరాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ లత విజయం సాధించారు. ప్రత్యర్థి రాథోడ్ మనోజ్‌పై 50 ఓట్ల తేడాతో రాథోడ్ లత గెలుపొందారు. ఈ గ్రామపంచాయతీలో 8 వార్డు స్థానాలకు సభ్యులను ఎన్నుకున్నారు. .