News September 10, 2025
MNCL: చచ్చిపోవటం తప్పు సోదరా..!

MNCL జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. చిన్నపాటి సమస్యకు క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. చిన్న సమస్యలకే యువత నుంచి వృద్ధుల వరకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2023లో 414, 2024లో 418, ఈ ఏడాది ఇప్పటి వరకు 275 మంది ఆత్మహత్య చేసుకున్నారు. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, ధైర్యంగా ఎదుర్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News December 6, 2025
బిల్వ స్వర్గం గుహల్లో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్.!

నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని కనుమకింది కొట్టాల గ్రామ సమీపాన ఉన్న బిళ్ళస్వర్గం గుహల వద్ద సినిమా షూటింగ్ సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా యూనిట్ బృందం గుహల సన్నివేశాల చిత్రీకరణ కోసం వచ్చింది. దీంతో ఈ సందర్భంగా సినిమా యూనిట్ బృందం తరలిరావడంతో గుహల్లో సందడి వాతావరణం నెలకొంది.
News December 6, 2025
ఖమ్మం: గ్రామాల్లో ‘బుజ్జగింపుల’ రాజకీయం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగియడంతో గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కాయి. తమ గెలుపుపై ప్రభావం చూపే బలమైన పోటీదారులను బ్రతిమిలాడి, బుజ్జగించి పోటీ నుంచి తప్పించేందుకు ప్రధాన అభ్యర్థులు, వారి మద్దతుదారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఖర్చు ఇస్తామని ఆఫర్ చేస్తుంటే, మరికొందరు మొండిగా పోటీలో ఉంటామని చెబుతున్నారు.
News December 6, 2025
ఖమ్మం: పల్లెల్లో ఎన్నికలు.. HYDలో ఉన్న ఓటర్లే కీలకం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బతుకుదెరువు కోసం HYDకు వలస వెళ్లిన పల్లె ఓటర్లే సర్పంచ్ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే కీలక శక్తిగా మారారు. దీంతో అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు హైదరాబాద్లోనే మకాం వేశారు. తమను గెలిపిస్తే అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీలు ఇస్తున్నారు. ఈ కీలక ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.


