News February 9, 2025
MNCL: త్వరలో వాహనాలకు ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని మండలాల గ్రామాల వాహనాలకు త్వరలో ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని తాళ్లపేట రేంజ్ అధికారి సుష్మారావు తెలిపారు. స్థానిక వాహనాలకు చెక్పోస్టుల వద్ద ఎలాంటి రుసుము వసూలు చేయమన్నారు. 24 గంటలు వాహనదారులు రాకపోకలు సాధించుకోవచ్చని వెల్లడించారు. ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటుతో ఇక్కడి వాహనదారులకు ఇబ్బందులు తలుగుతాయని, దానిపై ఉన్నతాధికారులు పునరాలోచిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 18, 2026
రంగారెడ్డి: పోలీసుల అదుపులో 23 మంది విదేశీయులు

టోలిచౌకి పరిధిలోని పలు కాలనీల్లో డీసీపీ చంద్రమోహన్ పర్యవేక్షణలో 250 మంది పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్న 23 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలతో పాటు 53 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
News February 18, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 18, 2026
ఏడుపాయలలో తప్పిపోయిన చిన్నారి.. తల్లిదండ్రుల చెంతకు

ఏడుపాయల జాతరలో తప్పిపోయిన ఐదేళ్ల బాలికను అదనపు ఎస్పీ మహేందర్ క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించి మానవీయత చాటుకున్నారు. భక్తుల రద్దీలో ఏడుస్తున్న చిన్నారిని గమనించిన ఆయన పాపకు ధైర్యం చెప్పి వివరాలు సేకరించారు. పోలీసు యంత్రాంగం సాయంతో బాలిక తల్లిదండ్రులను గుర్తించి అప్పగించారు. వేల మంది జనాల మధ్య తమ బిడ్డను క్షేమంగా చేర్చిన అదనపు ఎస్పీకి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.


