News August 13, 2025
MNCL: ‘ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. కమిషనరేట్ పరిధిలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని సూచించారు. పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే, స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కు ఫోన్ చేసి సహాయం పొందాలని కోరారు.
Similar News
News March 9, 2026
OFFICIAL: ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్తాబా

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు <<19299249>>మొజ్తాబా<<>> ఖమేనీ ఎన్నికైనట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. 88 మందితో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ బాడీ ఆయన్ను ఎన్నుకుంది. ఇరానియన్లు ఐక్యతను కాపాడుకోవాలని, మొజ్తాబా ఖమేనీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చింది. నిర్ణయాత్మక ఓటు ద్వారా ఆయన ఎన్నికైనట్లు సమాచారం. ప్రస్తుతం మొజ్తాబా వయసు 56 ఏళ్లు.
News March 9, 2026
యూట్యూబ్‌లోనే వీడియోలు, మెసేజ్‌లు పంపుకోవచ్చు!

యూట్యూబ్‌లో డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్ మళ్లీ రాబోతోంది. యాప్‌లోనే వీడియోలు, మెసేజ్‌లు పంపుకునేలా వెసులుబాటు కల్పించే ఈ ఫీచర్‌ను 2019లో కంపెనీ నిలిపివేసింది. ఇప్పుడు కొత్త వెర్షన్‌తో తీసుకురానుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఇతర యాప్‌లు అవసరం లేకుండానే యూట్యూబ్‌లోనే వీడియోలు, మెసేజ్‌లు పంపుకోవచ్చు. దీనితో పాటు షార్ట్స్ కోసం AI రీమిక్స్ ఫీచర్ కూడా రానుంది.
News March 9, 2026
పోచమ్మమైదాన్ జంక్షన్‌లో ఉద్రిక్తత.. లాఠీచార్జ్

వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్ వద్ద ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఛత్రపతి జెండాను ఓ వర్గానికి చెందిన యువకుడు తొలగించడంతో వివాదం చెలరేగింది. దీంతో మరో వర్గం అక్కడే మళ్లీ జెండా ఏర్పాటు చేయడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి జనాన్ని చెదరగొట్టారు. ఘటనపై పోలీసులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.


