News August 22, 2025

MNCL: బాలసదనం పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

నస్పూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న బాలసదనం భవన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. గురువారం ఆయన బాలసదనం భవనాన్ని పరిశీలించారు. మిషన్ వాత్సల్య నిధుల నుంచి రూ.1.34 కోట్లతో చేపట్టిన ఈ పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించి, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.

Similar News

News January 21, 2026

SRD: విద్యార్థుల భద్రతలో నిర్లక్ష్యం.. హెచ్‌ఎం సస్పెన్షన్

image

జిన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మృదులను సస్పెండ్ చేస్తూ డీఈఓ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. సైన్స్ ఫెయిర్ కోసం విద్యార్థులను నిబంధనలకు విరుద్ధంగా డీసీఎం వాహనంలో తీసుకెళ్లి, వారి ప్రాణాలను రిస్క్‌లో పెట్టినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. ఎటువంటి భద్రతా జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ బుధవారం వెల్లడించింది.

News January 21, 2026

‘మూసీ పునరుజ్జీవనం’లో ‘టాటా’ భాగస్వామ్యం

image

TG: దావోస్‌లో టాటా ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. విజన్–2047 లక్ష్యాలు, రాష్ట్రంలోని పెట్టుబడుల అనుకూల విధానాలను వివరించారు. HYDలోని స్టేడియాల అభివృద్ధికి సహకరించాలని కోరగా టాటా ఛైర్మన్ సంసిద్దత తెలిపారు. మూసీ నది పునరుజ్జీవనంలో భాగస్వామ్యమయ్యేందుకు ఆసక్తి వ్యక్తపరిచారు. హోటళ్లు, రిసార్ట్స్, మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటు చేసేందుకు CM చంద్రశేఖరన్ చర్చించారు.

News January 21, 2026

మెదక్ జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు: కలెక్టర్

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వేగవంతమైన పరిష్కారం కోసం జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓలు, డీఎస్పీలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.