News November 17, 2025
MNCL: బైక్ చక్రంలో చీరకొంగు ఇరుక్కొని మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి ఘటన స్థానికంగా కలకలం రేపింది. గోదావరిఖని గోదావరి బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. MNCL జిల్లా వేమనపల్లికి చెందిన లత(35) తమ్ముడు అరుణ్ బైక్ పై GDK నుంచి ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలో తన చీర కొంగు వెనుక వీల్‌లో ఇరుక్కుపోవడంతో ఇద్దరు కింద పడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా లత అక్కడికక్కడే మృతిచెందింది. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News January 17, 2026
ఖమ్మం, భద్రాద్రిలో మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఇవే.!

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీ ఛైర్మన్ల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ – ఎస్టీ జనరల్, ఖమ్మం కార్పొరేషన్ – జనరల్ మహిళ, అశ్వారావుపేట మున్సిపాలిటీ – జనరల్ మహిళ, ఇల్లందు – బీసీ మహిళ, కల్లూరు – ఎస్టీ జనరల్, మధిర – జనరల్ మహిళ, వైరా – జనరల్ మహిళ, సత్తుపల్లి – జనరల్ మహిళ, ఏదులాపురం – ఎస్సీ మహిళకు కేటాయించారు.
News January 17, 2026
కోళ్ల పందేలు.. రూ.2వేల కోట్ల వ్యాపారం!

AP: ఈ సంక్రాంతి సీజన్‌లో కోళ్ల పందేళ్ల రూపంలో సుమారు రూ.2వేల కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనే పందేల విలువ రూ.1,500 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఈసారి జోరుగా పందేలు సాగాయి. పెద్దఎత్తున తెలంగాణవాసులు కూడా పందేళ్లలో పాల్గొని సందడి చేశారు. అత్యధికంగా ఓ వ్యక్తి రూ.1.53 కోట్లు గెలుచుకున్నారు.
News January 17, 2026
NZB: వరుసగా మూడోసారి మేయర్ పదవి మహిళ (జనరల్)కే

త్వరలో జరగబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ పదవి మహిళ (జనరల్)కు రిజర్వ్ అయింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ప్రకటన విడుదల చేసింది. గత రెండు పర్యాయాలు మహిళ (జనరల్)కు రిజర్వ్ అవగా BRS నుంచి ఆకుల సుజాత, దండు నీతూ కిరణ్ మేయర్ పదవిని చేపట్టారు. ఈ పర్యాయం BJP, కాంగ్రెస్, BRS, MIM పార్టీలు మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి.


