News November 5, 2025
MNCL: మహిళల రక్షణ కోసం షీ టీమ్స్: సీపీ

మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ పని చేస్తున్నాయని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 2 షీ టీం బృందాలు పని చేస్తున్నాయన్నారు. మహిళ భద్రత, రక్షణ చర్యలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కమిషనరేట్ షీ టీం నం.6303923700, మంచిర్యాల జోన్ నం. 8712659386కు కాల్, వాట్సాప్ ద్వారా మెసేజ్ లేదా డయల్ 100కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సూచించారు.
Similar News
News January 24, 2026
హైకోర్టులే ప్రాథమిక సంరక్షకులు: సీజేఐ సూర్యకాంత్

సాధారణ ప్రజలకు న్యాయం అందించడంలో హైకోర్టుల పాత్ర అత్యంత కీలకమని CJI జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఇవి ప్రాథమిక సంరక్షకులుగా నిలుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. న్యాయం ప్రజలకు దూరమైన భావన రాకుండా చేయడంలో వీటి పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. HCలు కేవలం అప్పీల్/రివిజన్ కోర్టులుగా కాకుండా, రాజ్యాంగ పరిరక్షణకు అందుబాటులో ఉండే కేంద్రాలుగా మారాలన్నారు. నేరుగా SCను ఆశ్రయించడాన్ని తాను వ్యతిరేకిస్తానన్నారు.
News January 24, 2026
హన్మకొండ: 386 మంది గర్భిణీలకు SMSలు

జాతీయ బాలికా దినోత్సవ సంధర్భంగా బాలురతో సమానంగా బాలికల నిష్పత్తిని మెరుగు పరిచేందుకు, లింగ నిర్ధారణ నేరం అని తెలియజేసేలా హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరిష్ ప్రత్యేకంగా రూపొందించిన ‘గర్భవతి అయిన మీకు శుభాకాంక్షలు’ గర్భం దాల్చిన వెంటనే ఏఎన్ఎం వద్ద పేరు తప్పకుండా నమోదు చేసుకోవాలి. అనే సంక్షిప్త సందేశాన్ని 3వ నెల నిండిన 386 మంది గర్భిణీల మొబైల్ కు శనివారం పంపించినట్లు డిఎంహెచ్వో డా.అప్పయ్య తెలిపారు.
News January 24, 2026
RGM: సమ్మక్క జాతర ప్రదేశాన్ని పరిశీలించిన సీపీ

గోదావరిఖని సమ్మక్క జాతర ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. గోదావరి బ్రిడ్జి సమీపంలోని సమ్మక్క జాతర ప్రదేశాన్ని శనివారం పోలీసు అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. జాతర పరిసరాలను పరిశీలించారు. భక్తుల భద్రత, రక్షణ, ట్రాఫిక్ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.


