News September 11, 2025
MNCL: మిస్టరీగా నానమ్మ, మనవరాలు మృతి

మంచిర్యాలలోని గోపాల్‌వాడ రైల్వే ఏ క్యాబిన్ సమీపంలో బెజ్జాల సత్యవతి(60), ఆమె మనవరాలు గీత శిరీష(4) మృతి మిస్టరీగా మారింది. హత్య లేదా ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం సత్యవతి కుమారుడు (ట్రాన్స్‌జెండర్) కూడా అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇంటిని విక్రయించడానికి ఖమ్మం నుంచి వచ్చిన వీరు అనుమానాస్పద స్థితిలో మరణించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Similar News
News December 6, 2025
హిందీలో ‘పెద్ది’కి గట్టి పోటీ

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తదుపరి చిత్రం ‘పెద్ది’ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ 2026 మార్చి 27న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాకి హిందీలో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మార్చి 19న యశ్ ‘టాక్సిక్’తో పాటు అజయ్ దేవ్‌గణ్ ‘ధమాల్ 4’, రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ విడుదలకు రెడీ అవుతున్నాయి. వీటికి హిట్ టాక్ వస్తే ‘పెద్ది’ ఓపెనింగ్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.
News December 6, 2025
బాబోయ్.. మాకు తిరుపతి SVU వద్దు!

తిరుపతి SVU పరిధిలోని MBA, MCA కాలేజీలు వర్సిటీ నిర్ణయాలతో గగ్గోలు పెడుతున్నాయి. అధిక ఫీజులు, పరిపాలన విధానపరమైన నిర్ణయాలు సరిగా లేకపోవడం, పరీక్షా ఫలితాలు ఆలస్యం తదితర కారణాలతో SVU నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. NOC ఇస్తే అనంతపురం జేఎన్టీయూ తదితర వర్సిటీల నుంచి గుర్తింపు పొందాలని చూస్తున్నాయి. మరి SVU అధికారులు వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారా? లేక NOCలు ఇస్తారా? వేచి చూడాలి.