News May 7, 2025

MNCL: లక్ష్మీప్రసన్న ప్రాణం తీసిన ఫోన్ కాల్

image

మంచిర్యాలలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల డిగ్రీ కళాశాల భవనంపై నుంచి దూకి విద్యార్థిని లక్ష్మీప్రసన్న ఆత్మహత్య చేసుకోవడానికి ఫోన్ కాల్ కారణమైంది. బుధవారం రాత్రి లక్ష్మీ ప్రసన్న కాలేజీ వాచ్ మెన్ ఫోన్ ద్వారా చిన్నమ్మ కొడుకు వెంకటేశ్‌కు కాల్ చేసింది. రాత్రివేళ ఫోన్ ఎందుకు ఇచ్చావని ఆయన వాచ్‌మెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ దృష్టికి కూడా వెళ్లినట్లు తెలియడంతో లక్ష్మీప్రసన్న ఆత్మహత్య చేసుకుంది.

Similar News

News February 13, 2026

GNT: ఏపీపీసెట్-2026 నోటిఫికేషన్ విడుదల

image

రాష్ట్రంలోని వ్యాయామ విద్యా కళాశాలల్లో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీపీసెట్-2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు కన్వీనర్ పాల్ కుమార్ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 13 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.inను సంప్రదించాలని ఆయన సూచించారు.

News February 13, 2026

BREAKING: బోధన్ మున్సిపాలిటీలో హంగ్

image

ఉత్కంఠభరితంగా సాగిన బోధన్ మున్సిపాలిటీ కౌంటింగ్‌లో చివరకు హంగ్ ఏర్పడింది. మొత్తం 38 వార్డుల్లో 17 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు జయకేతనం ఎగరవేయగా 12 స్థానాల్లో MIM, BJP 3, BRS 5 స్థానాల్లో గెలిచాయి. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. మ్యాజిక్ ఫిగర్‌ సంఖ్య 20కి ఎవరూ చేరుకోకపోవడంతో హంగ్ నెలకొంది.

News February 13, 2026

మున్సిపల్ పోరు: రెండో రౌండ్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ..!

image

నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. భైంసాలో ఎంఐఎం, స్వతంత్రులు ఆధిపత్యం చాటుతూ ప్రధాన పార్టీలకు షాక్ ఇస్తుండగా.. నిర్మల్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘నువ్వా-నేనా’ అన్నట్లు హోరాహోరీ సాగుతోంది. మొదటి రౌండ్ ముగిసేసరికి ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో అందరి కళ్లు రెండో రౌండ్ ఫలితాలపైనే ఉన్నాయి. తుది ఫలితాలు ఎవరి తలరాతను మారుస్తాయో వేచి చూడాలి.