News April 25, 2025

MNCL: వడదెబ్బకు ఏడుగురి మృతి

image

ఉమ్మడి ADB జిల్లా అగ్నిగుండంలా మారింది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని మండలాల్లో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో నిర్మల్ జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, ఆసిఫాబాద్‌లో ఒకరు, ఆదిలాబాద్‌లో ఒకరు చొప్పున మృతిచెందారు. అనధికారికంగా సంఖ్యల ఎక్కువే ఉండొచ్చు. జాగ్రత్తలు పాటించండి. బయట తిరగొద్దు. నీరు అధికంగా తాగండి.

Similar News

News March 9, 2026

SKLM: విద్యార్థులు అలర్ట్.. ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్ డే

image

ఎచ్చెర్లలోని డాక్టర్ B.R.అంబేడ్కర్ యూనివర్సిటీలో డిగ్రీ 2021-22, 2022-23, 2023-24 అడ్మిటెడ్ బ్యాచ్ ఆరో సెమిస్టర్ ఇంటర్న్ షిప్ ఫీజు చెల్లించేందుకు గడువు నేటితో ముగియనుంది. ఈ మేరకు అభ్యర్థులు రూ.1425లను ఆయా కళాశాలలో, యూనివర్సిటీకి వచ్చి చెల్లించాలని ఎగ్జామినేషన్స్ డీన్ ఎం.అనురాధ ప్రకటనలో వెల్లడించారు. రూ.500 ఫైన్‌తో ఈ నెల 10 వరకు, రూ.1500 ఫైన్‌తో 11 తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు అన్నారు.

News March 9, 2026

సూర్యాపేట: సైబర్ నేరాలు.. ఊరు వదిలి వెళుతున్నారు

image

సూర్యాపేట జిల్లాలో ఇటీవల కొంతమందిపై సైబర్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వారి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. భయంతో కొంతమంది సైబర్ నేరగాళ్లు గ్రామాలు వదిలి వెళుతున్నట్లు సమాచారం. HYDతో పాటు పలు ద్వితీయ శ్రేణి పట్టణాలలో ఉంటున్నట్లు తెలుస్తోంది. పోలీసులు వారిని పట్టుకునే పనిలో ఉన్నారు. సైబర్ నేరాల్లో జీవితం నాశనం చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News March 9, 2026

VKBలో ఎండలు.. జంకుతున్న ప్రజలు

image

భానుడి ప్రతాపం అధికంగా ఉండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ప్రధానంగా ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు జిల్లా అంతా తిరుగుతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక బయటికి రాని పరిస్థితి ఉన్నప్పటికీ తప్పనిసరిగా బయటికి రావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ వారంలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వారంలో 40 డిగ్రీలు టచ్ అయ్యే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్ర హెచ్చరించింది.