News March 13, 2025
MNCL: వరకట్న వేధింపులు.. ఇద్దరిపై కేసు: CI

వరకట్న వేధింపుల కేసులో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నరేశ్ కుమార్ తెలిపారు. జిల్లాకేంద్రంలో హమాలివాడకు చెందిన ముత్యాల స్వాతికి విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేసే కాగజ్‌నగర్‌కు చెందిన రాంప్రసాద్‌తో 2011 మార్చి 24న వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదనపు కట్నం కోసం భర్తతో పాటు ఆడపడుచు సరోజ వేధించడంతో స్వాతి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 19, 2026
మార్చి 15లోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ: టీపీసీసీ చీఫ్

TG: వచ్చే నెల 15వ తేదీలోగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఢిల్లీలో AICC పెద్దలతో రాష్ట్ర మంత్రులు, కీలక నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మున్సిపల్ ఎన్నికలపై పార్టీ అధిష్ఠానం సంతృప్తి వ్యక్తం చేసింది. రాజగోపాల్ రెడ్డి అంశంపైనా చర్చించాం. త్వరలో ఆయనతో మాట్లాడతాం. రాజ్యసభ అభ్యర్థులపై 2 రోజుల్లో మళ్లీ చర్చలు జరుగుతాయి’ అని వెల్లడించారు.
News February 19, 2026
608 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (<
News February 19, 2026
HYDలో అతిపెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్..!

FEB 20,21,22 తేదీల్లో 3రోజులు HYDలో అగ్రి షో పేరుతో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రైతుబడి సంస్థ నిర్వాహకులు రాజేందర్ తెలిపారు. NTR స్టేడియంలో ఈ ప్రోగ్రాం ఉంటుందని.. 3రోజుల్లో లక్షమంది రైతులు హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. దేశ, విదేశాల నూతన వ్యవసాయ సాంకేతికతను వివరించేందుకు 500కుపైగా కంపెనీలు ఈ ప్రదర్శనలో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. www.rbagrishow.com.


