News April 25, 2025
MNCL: విలేకరుల ముసుగులో దందా.. ఇద్దరి అరెస్ట్

విలేకరుల ముసుగులో మత్తు పదార్థాల దందా చేస్తున్న నిందితులను జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. CI సమ్మయ్య కథనం ప్రకారం.. తాండూరు మండలం జాతీయ రహదారి వద్ద ప్రెస్‌స్టిక్కర్ అంటించిన టాటా ఇండికా కారును తనిఖీ చేశారు. కారులో 216 కిలోల బెల్లం, 30 కిలోల పటిక పట్టుబడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకొని రాజ్ కుమార్, సంజులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు చందు పరారీలోఉన్నాడు.
Similar News
News March 13, 2026
కావలి: రైలులో నుంచి జారిపడి వ్యక్తి మృతి

రైలులో నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. తలమంచి- అల్లూరు రోడ్డు రైల్వే స్టేషన్ మధ్య గుర్తుతెలియని సుమారు 27ఏళ్ల వ్యక్తి బెంగళూరు- గువాహటి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మరణించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు నలుపు రంగు టీ షర్ట్, లైట్ బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు చెప్పారు. వివరాలు తెలిస్తే కావలి రైల్వే పోలీసులకు తెలపాలని కోరారు.
News March 13, 2026
ఏలూరు: కలెక్టరేట్‌లో మొల్లమాంబ జయంతి

ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జేసీ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కవయిత్రి మొల్ల మాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత విద్యార్థిని విద్యార్థులు స్ఫూర్తి పొందాలని సూచించారు. రామాయణాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా తక్కువ వ్యవధిలో రచించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
News March 13, 2026
అమ్రాబాద్: గవర్నర్ దంపతులకు అధికారుల ఘన స్వాగతం

తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల దంపతులకు అమ్రాబాద్ మండలం మన్ననూర్ వద్ద జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. శ్రీశైలం వెళ్తున్న క్రమంలో గెస్ట్ హౌస్ వద్ద కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.


