News September 12, 2025
MNCL: ‘సింగరేణిలో కాంగ్రెస్ అవినీతి రాజ్యం’

సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి రాజ్యం నడిపిస్తోందని HMS గౌరవ అధ్యక్షురాలు కవిత అన్నారు. శనివారం హైదారాబాద్‌లో జరిగిన కేంద్ర కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి కాంట్రాక్టులో జరుగుతున్న 25 శాతం అవినీతిలో 10 శాతం కాంగ్రెస్ పెద్దలకు వెళ్తోందని ఆరోపించారు. అవినీతిని అడ్డుకోకపోతే సింగరేణి భవన్‌ను ముట్టడిస్తామని, అవసరమైతే సీబీఐ, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు.
Similar News
News December 7, 2025
తిరుపతి: వారిపై గతంలోనూ ఆరోపణలు ఉన్నాయా..?

NSUలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అ.ప్రొఫెసర్లు మాజీ VC మురళీధర్ శర్మ హయాంలో విధుల్లో చేరారు. వీరిలో లక్ష్మణ్(మహారాష్ట్ర), శేఖర్ రెడ్డి (AP)కి చెందిన వారు. లక్ష్మణ్‌పై గతంలో యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయట. మరి ఇలాంటి వ్యక్తి ఏమి చేయలేదంటే ఎలా నమ్ముతారన్నది కొందరి వాదన. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వర్సిటీ అధికారులదే.
News December 7, 2025
తిరుపతి: మరో ప్రొఫెసర్‌ది అదే డిపార్ట్మెంట్.!

తిరుపతి NSUలో యువతిపై వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ఎడ్యూకేషన్ డిపార్ట్మెంట్‌లో పని చేస్తున్నారు. వీడియో తీసి బెదిరింపులకు దిగినట్లు ఆరోపిస్తున్న మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ అదే విభాగానికి చెందిన శేఖర్ రెడ్డి అన్న చర్చ నడుస్తోంది. అతను ‘నాకు సంబంధం లేకుండా నా పేరు తెచ్చారు’ అని సిబ్బందితో మట్లాడినట్లు సమాచారం.
News December 7, 2025
తిరుపతి: వర్సిటీ ICC ఏమి చేసింది.!

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో యువతిపై వేధింపుల కేసులో INTERNAL COMPLAINT COMMITY (ICC) ఇద్దరు ప్రొఫెసర్లను విచారించినట్లు చర్చ నడుస్తుంది. ఈ కమిటీలోని నలుగురు సభ్యులు అసిస్టెంట్ ప్రొ.లక్ష్మణ్ కుమార్‌ను ప్రశ్నించగా ‘యువతిని తీసుకురాండి.. నాపై అనవసరంగా ఫిర్యాదు చేసింది’ అని చెప్పినట్లు సమాచారం.


