News April 12, 2024
MNCL: సెల్‌ఫోన్ రిపేర్ చేయించలేదని యువతి సూసైడ్

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన సాయిష్మ అనే యువతి సెల్‌ఫోన్ రిపేర్ చేయించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడింది. 15 రోజుల కిందట సెల్‌ఫోన్ డిస్ ప్లే పగిలిపోవడంతో బాగు చేయించాలని తల్లిదండ్రులను కోరింది. ఈ విషయంలో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండగా గురువారం ఆమె తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయిష్మ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు ఏఎస్సై నాగరాజు తెలిపారు.
Similar News
News March 18, 2025
ఆదిలాబాద్: యువకుడికి ST కేటగిరిలో 1st ర్యాంకు

ఆదిలాబాద్ రూరల్ లోహర గ్రామానికి చెందిన మర్సకోల జ్యోతిరాం నిన్న విడుదలైన HWO ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటారు. పట్టుదలతో కష్టపడి చదివి రాష్ట్రస్థాయిలో 34వ ర్యాంకు, బాసర జోన్ ST కేటగిరిలో మొదటి ర్యాంక్ సాధించి, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కి ఎంపికయ్యారు. ఉద్యోగం సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
News March 18, 2025
ఆదిలాబాద్: ఆరుగురు అరెస్ట్

మట్కా నిర్వహిస్తున్న మహిళా గ్యాంగ్‌ను అరెస్ట్ చేసినట్లు ADB టూ టౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. మట్కా నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలో దాడులు నిర్వహించగా మట్కా నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. కాగా, ఇందులో నలుగురు ఆడవాళ్లు, ఇద్దరు మగవారు ఉన్నారు. మట్కా చిట్టీలతో పాటు 2 సెల్ ఫోన్లు, రూ.2,260 నగదు స్వాధీనం చేసుకొని.. వారిపై కేసు నమోదు చేశారు.
News March 18, 2025
12 నుంచి 4 వరకు బయటకు రావొద్దు : ADB కలెక్టర్

ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని రోజురోజుకి భానుడి ప్రతాపం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దన్నారు. అత్యవసరమైతే తప్పా బయటకు రావాలని సూచించారు. బయటకు వెళితే వెళ్లినప్పుడు తలపై టోపీ పెట్టుకోవాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ 4 నెలలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.