News September 10, 2025

నేపాల్‌లో శాంతికి పిలుపునిచ్చిన మోదీ

image

నేపాల్‌లో యువత ఆందోళనలతో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై ప్రధాని మోదీ X వేదికగా స్పందించారు. ‘నేపాల్‌లో చోటుచేసుకున్న హింస హృదయవిదారకం. ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడి పరిస్థితులపై సెక్యూరిటీ క్యాబినెట్ కమిటీ చర్చించింది. నేపాల్‌లో స్థిరత్వం, శాంతి, శ్రేయస్సు మాకు చాలా ముఖ్యం. శాంతికి మద్దతివ్వాలని నేపాలీ సోదర, సోదరీమణులకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయన పిలుపునిచ్చారు.

Similar News

News December 7, 2025

విజయవాడలో నేటి నాన్ వెజ్ ధరలివే.!

image

విజయవాడలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్‌ లెస్ కేజీ రూ.260, స్కిన్‌ రూ.250 విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి కొన్ని ప్రాంతాల్లో స్వల్ప మార్పులు ఉన్నట్లు విక్రయదారుల చెబుతున్నారు. మటన్ కేజీ యథావిధిగా రూ.900 వద్ద కొనసాగుతోంది. చేపల్లో బొచ్చ కేజీ రూ.230గా ఉన్నాయి. 30 కోడిగుడ్లు గతవారం రూ.200 ఉండగా నేడు రూ.205కి అమ్ముతున్నారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News December 7, 2025

రోహిత్, కోహ్లీలకు గంభీర్ షాక్!

image

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగిన సిరీసుల్లో రాణించినప్పటికీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. విరాట్, రోహిత్ శర్మలు 2027 WC ఆడటంపై గ్యారంటీ ఇవ్వలేదు. వారిద్దరూ 2027 ప్రపంచకప్ ఆడతారా అని జర్నలిస్టులు అడగ్గా.. ‘వన్డే ప్రపంచకప్ మరో రెండేళ్లు ఉందని మీరు తెలుసుకోవాలి. ప్రస్తుతం గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. యంగ్ ప్లేయర్లు చక్కగా ఆడుతూ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నారు’ అని స్పష్టం చేశారు.

News December 7, 2025

విత్తన మొలక శాతం.. పంట దిగుబడికి ముఖ్యం

image

పంట దిగుబడి బాగుండాలన్నా, వ్యవసాయం లాభసాటిగా సాగాలన్నా పంటకు ‘విత్తనం’ ప్రధానం. అందుకే మేలైన దిగుబడి కోసం మొలక శాతం బాగా ఉన్న విత్తనాన్ని సేకరించాలి. విత్తన కొనుగోలు తర్వాత దాని మొలక శాతాన్ని పరిశీలించాలి. అది నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విత్తుకోవాలి. అసలు విత్తన మొలక శాతాన్ని ఎలా పరిశీలించాలి? దానికి అందుబాటులో ఉన్న పద్ధతులు ఏమిటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.