News June 4, 2024
మోదీ హ్యాట్రిక్కా? లేక ఫలితాల్లో ట్విస్ట్ ఉంటుందా?
నేడు వెల్లడికానున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు NDAదే విజయమని, ఆ కూటమికి 350కిపైగా సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఈ అంచనాలను తలకిందులు చేస్తూ తాము గెలుపొందుతామని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంచనాలకు తగినట్టు బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా? లేక ఫలితాల్లో ట్విస్ట్ ఉంటుందా? అనేది చర్చనీయాంశమైంది.
Similar News
News September 13, 2024
ఇదీ మంత్రుల పరిస్థితి: YCP
AP: మంత్రుల ఎదుట రెవెన్యూ, విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూర్చున్న తీరుని విమర్శిస్తూ YCP ఓ ఫొటోను ట్వీట్ చేసింది. అందులో మంత్రులు అనిత, అనగాని, నారాయణ, నిమ్మల ముందు సిసోదియా కాలు మీద కాలు వేసి కూర్చున్నారు. CBN ప్రభుత్వంలో మంత్రుల పరిస్థితి ఇది అంటూ YCP ఎద్దేవా చేసింది. కాగా VJA వరదల విషయం ముందే తెలుసని, లక్షల మందిని తరలించడం సాధ్యం కాదని సిసోదియా అన్న వ్యాఖ్యలు ఇటీవల వైరలయ్యాయి.
News September 13, 2024
సెన్సెక్స్ vs బంగారం: ఏది ఎక్కువ రిటర్న్ ఇచ్చిందంటే..
బంగారం ఇన్వెస్టర్ల పంట పండిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు సెన్సెక్స్ 15% రిటర్న్ ఇవ్వగా గోల్డ్ 16% అందించింది. 17% పెరిగిన నిఫ్టీతో గట్టిగా పోటీపడుతోంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడంతో పుత్తడి ఈ వారం 2% పెరిగింది. RBI, US, చైనా సైతం వడ్డీరేట్ల కోతకు మొగ్గుచూపడంతో ధర ఇంకా పెరగొచ్చు. MCX గోల్డ్ ఫ్యూచర్స్ త్వరలోనే రూ.75వేల స్థాయికి చేరొచ్చని నిపుణుల అంచనా.
News September 13, 2024
లక్ష విగ్రహాల నిమజ్జనం.. 25వేల మందితో బందోబస్తు: CP
TG: ఈ నెల 17న గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా 25 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఖైరతాబాద్ మహాగణపతిని మధ్యాహ్నం 1.30 గంటల్లోపు నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు అంగీకరించారని తెలిపారు. నగరవ్యాప్తంగా సుమారు లక్ష విగ్రహాలు హుస్సేన్‌సాగర్ ఒడికి చేరుకుంటాయని పేర్కొన్నారు.