News August 23, 2024

ఉక్రెయిన్‌లో మోదీ: అమెరికా స్పందించిన తీరిది

image

ఉక్రెయిన్‌లో నరేంద్రమోదీ పర్యటనపై అమెరికా స్పందించింది. యుద్ధ సంక్షుభిత దేశానికి ఇదెంతో సాయపడుతుందని పేర్కొంది. ‘జెలెన్ స్కీ కోరుకుంటున్నట్టు యుద్ధం ముగింపు వైపు ప్రధాని మోదీ పర్యటన సాగితే నిజంగా అదెంతో ఉపయోగకరం’ అని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. ఇదెంతో కీలక పర్యటన అని, చాలా సంతోషంగా ఉందని యూఎస్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రిచర్డ్ ఆర్ వర్మ తెలిపారు.

Similar News

News January 13, 2026

ధనుర్మాసం: ఇరవై తొమ్మిదో రోజు కీర్తన

image

కృష్ణుడిని సేవిస్తూ అండాళ్ తెలిపిన వ్రత పరమార్థం ఇది: ‘ఓ గోవిందా! మేము వేకువనే నీ సన్నిధికి వచ్చింది కోరికలు నెరవేర్చమని కాదు! మా జన్మజన్మల బంధం నీతోనే ఉండాలని, ఏడేడు జన్మల వరకు నీకే దాస్యం చేస్తూ నీ సేవలో తరించాలని! మా మనసులో ఉండే ఇతర కోరికలను తొలగించు. నీ పాద సేవ పట్ల అనురక్తిని ప్రసాదించు’ అని భగవంతుడిని ఏమీ ఆశించకుండా, నిరంతర సేవా భాగ్యాన్ని కోరుకుంటున్నారు. ఇదే నిజమైన భక్తి. <<-se>>#DHANURMASAM<<>>

News January 13, 2026

SBI ఖాతాదారులకు అలర్ట్

image

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇతర బ్యాంక్ ATMల్లో ఫ్రీ ట్రాన్సాక్షన్లు సంఖ్య (నెలకు 5) కంటే ఎక్కువగా ఉపయోగిస్తే ప్రతి విత్ డ్రాకు రూ.23+జీఎస్టీ వసూలు చేయనుంది. ఇక బ్యాలెన్స్ చెక్ చేసినా, మినీ స్టేట్‌మెంట్‌ తీసినా రూ.11 కట్ కానున్నాయి. శాలరీ ఖాతాదారులు నెలకు 10 లావాదేవీల వరకు ఉచితం. పెరిగిన ఛార్జీలు 2025 డిసెంబర్ నుంచే అమలులోకి వచ్చినట్లు పేర్కొంది.

News January 13, 2026

ఎంత ప్రయత్నించినా పెళ్లి కావడం లేదా? రేపే లాస్ట్..

image

ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి సంబంధం కుదరని వారు రేపు గోదా రంగనాథుల కళ్యాణాన్ని వీక్షించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ వేడుకను దర్శిస్తే తప్పక వివాహ యోగం కలుగుతుందని అంటున్నారు. ‘స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం వల్ల జాతకంలోని వివాహ ప్రతిబంధకాలు తొలగిపోతాయి. త్వరగా పెళ్లి జరిగే అవకాశాలు పెరుగుతాయి. గోదాదేవి చేసిన తిరుప్పావై వ్రత ఫలితంగానే ఆమెకు విష్ణుమూర్తి భర్తగా లభించారు’ అని చెబుతున్నారు.