News August 20, 2024
లేటరల్ ఎంట్రీపై రాజ్యాంగానికి కట్టుబడ్డ మోదీ: కేంద్రమంత్రి
UPSC నోటిఫికేషన్ రద్దు నిర్ణయంతో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి ప్రధాని మోదీ కట్టుబడ్డారని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ‘UPA హయాంలో లేటరల్ ఎంట్రీ విధానంలో రిజర్వేషన్లు లేవు. కాంగ్రెస్ అప్పుడు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుందో లేదో చెప్పాలి. ఇప్పుడు లేటరల్ ఎంట్రీలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టి మోదీ సామాజిక న్యాయానికి కట్టుబడ్డారు’ అని ఆయన వివరించారు.
Similar News
News September 18, 2024
ట్రంప్‌నకు ఫోన్ చేసి పరామర్శించిన కమల
డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి <<14112153>>హత్యాయత్నం<<>> జరిగిన నేపథ్యంలో ఆయనకు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన క్షేమంగా ఉండటంపై సంతోషం వ్యక్తం చేసినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. ట్రంప్‌నకు సమీపంలో కాల్పుల ఘటనను ఆమె ఇప్పటికే ఖండించారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో వీరిద్దరూ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్, డెమొక్రాట్ పార్టీ నుంచి కమలా బరిలో దిగుతున్నారు.
News September 18, 2024
వంట నూనెల ధరలు పెంచొద్దన్న కేంద్రం
వంట నూనెల ధరలను పెంచొద్దని సంబంధిత సంస్థలను కేంద్రం ఆదేశించింది. తక్కువ సుంకానికి దిగుమతి చేసుకున్న వంట నూనెల స్టాక్ దాదాపు 30 లక్షల టన్నులు ఉందని తెలిపింది. ఇది 45-50 రోజులకు సరిపోతాయంది. కాగా అధిక దిగుమతులతో నూనె గింజల ధరలు దేశీయంగా పడిపోతుండటంతో కేంద్రం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. దీంతో ధరలు పెరుగుతాయన్న వాదనలు వినిపిస్తుండటంతో పరిశ్రమ వర్గాలతో కేంద్రం సమావేశమై సూచనలు చేసింది.
News September 18, 2024
Learning English: Synonyms
✒ Do: Execute, Enact, Finish
✒ Dull: Lifeless, Tedious, Tiresome
✒ Eager: Keen, Fervent, Involved
✒ End: Stop, Finish, Terminate
✒ Enjoy: Appreciate, Delight In,
✒ Explain: Clarify, Define, Interpret
✒ Fair: Impartial, Unbiased, Objective
✒ Fall: Drop, Plunge, Topple
✒ False: Fake, Fraudulent, Counterfeit