News February 26, 2025

మే 9న రష్యాకు మోదీ?

image

ప్రధాని నరేంద్రమోదీ త్వరలో రష్యాకు వెళ్తారని తెలిసింది. మే9న మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా వస్తారని అక్కడి మీడియా అంచనా వేసింది. గ్రేట్ పేట్రియాటిక్ వార్ 80వ వార్షికోత్సవం సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్ ఆయన్ను ఆహ్వానించారని పేర్కొంది. కొన్ని రోజుల క్రితమే అమెరికా ప్రెసిడెంట్‌ను మోదీ కలిశారు. ఇప్పుడు పుతిన్‌ను కలవనున్నారన్న వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.

Similar News

News November 12, 2025

APPLY NOW: CCRASలో ఉద్యోగాలు

image

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (<>CCRAS<<>>) 5 కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 21న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. BAMS, MD, MS(ఆయుర్వేదం), PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. https://ccras.nic.in/

News November 12, 2025

షాహీన్.. పనులతో పరేషాన్!

image

ఉగ్రకుట్ర కేసులో <<18257542>>అరెస్టైన<<>> డా.షాహీన్‌ దేశంలో జైషే మహ్మద్ ఉమెన్స్ వింగ్‌ను నడిపిస్తోంది. ఉగ్ర సంస్థ మహిళా విభాగం చీఫ్‌, జైషే ఫౌండర్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్‌తో షాహీన్‌కు నేరుగా సంబంధాలున్నట్లు గుర్తించారు. చీఫ్ ఆదేశాలతో ఆమె దేశంలో మహిళలకు బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదంలోకి దింపుతోంది. షాహీన్ అమాయకంగా, క్రమశిక్షణతో ఉండేదని 2009లో ఆమె పనిచేసిన కన్నౌజ్ మెడికల్ కాలేజీ అధికారులు చెప్పడం గమనార్హం.

News November 12, 2025

ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం మరింత పెంచుతాం: మంత్రి తుమ్మల

image

TG: ఆయిల్ పామ్ సాగులో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2.74 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతుండగా.. మరో 12 లక్షల ఎకరాలు ఈ పంట సాగుకు అనువుగా ఉందని తెలిపారు. వచ్చే నాలుగేళ్లపాటు ప్రతి ఏడాది కొత్తగా 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తూ.. వచ్చే మూడేళ్లలో 10 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెంచుతామన్నారు.