News September 11, 2025
RSS చీఫ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మోదీ

RSS చీఫ్ మోహన్ భగవత్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘వసుధైవ కుటుంబకం’ అనే మంత్రంతో ప్రేరణ పొందిన వ్యక్తి భగవత్ అని కొనియాడారు. సమానత్వం, సోదరభావ స్ఫూర్తిని బలోపేతం చేయడానికి ఆయన జీవితాన్ని అంకితం చేశారని ట్వీట్ చేశారు. భరతమాతకు ఎల్లప్పుడూ సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారన్నారు. ఆయన దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
Similar News
News December 10, 2025
సుందర్ పిచాయ్‌తో మంత్రి లోకేశ్ భేటీ

US పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ గూగుల్ CEO సుందర్ పిచాయ్‌తో భేటీ అయ్యారు. విశాఖలో AI డేటా సెంటర్ పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్-సర్వర్ తయారీ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించాలన్నారు. సంస్థలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు.
News December 10, 2025
IOCLలో 509 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News December 10, 2025
దారిద్ర్య దహన గణపతి స్తోత్రం ఎందుకు పఠించాలి?

ఆర్థిక సమస్యలు, దారిద్ర్య బాధలను తొలగించుకోవడానికి ఈ స్తోత్రాన్ని పఠించాలని పండితులు సూచిస్తున్నారు. నిత్యం పఠిస్తే గణేశుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెబుతున్నారు. ‘తలపెట్టిన పనులు అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. ఈ మహా మహిమాన్విత స్తోత్రాన్ని 45 రోజుల పాటు క్రమం తప్పకుండా పఠిస్తే, ఆ వంశంలో పది తరాల వరకు దారిద్ర్య బాధలుండవని శాస్త్రాలు చెబుతున్నాయి’ అని అంటున్నారు.


