News July 4, 2024

ఓటమిలో.. గెలుపులో టీమ్ఇండియాతో మోదీ

image

టీ20 WC-2024 ట్రోఫీని గెలుపొంది స్వదేశానికి తిరిగివచ్చిన భారత జట్టును ప్రధాని మోదీ కలుసుకొని ప్రతి ఒక్కరినీ అభినందించారు. విశ్వవిజేతల కుటుంబాలను కలుసుకొని వారితో సందడిగా గడిపారు. ఈక్రమంలో CWC2023 ఫైనల్‌లో ఓడిపోయినప్పుడు మోదీ టీమ్ఇండియాను కలిసి ఆటగాళ్లలో స్థైర్యాన్ని నింపిన సన్నివేశాన్ని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఓటమిలోనూ, గెలుపులోనూ మోదీ టీమ్‌కు తోడుగా ఉన్నారని ట్వీట్స్ చేస్తున్నారు.

Similar News

News December 15, 2025

మజగన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో 200 పోస్టులు

image

<>మజగన్ <<>>డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌(MDL) 200 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు రేపటి నుంచి JAN 5వరకు అప్లై చేసుకోవచ్చు. ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. 18-27ఏళ్లు కలిగి, BE/బీటెక్, డిప్లొమా, డిగ్రీ(B.COM, BCA, BBA, BSW) ఉత్తీర్ణులు అర్హులు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్:mazagondock.in/

News December 15, 2025

2029 ఎన్నికల్లో పోటీ చేస్తా: కవిత

image

TG: 2029 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. Xలో ఆమె #AskKavitha హ్యాష్ ట్యాగ్‌తో క్వశ్చన్ హవర్ నిర్వహిస్తున్నారు. మీ కొత్త పార్టీ పేరు ఏంటి? అని ఓ నెటిజన్ అడగగా ‘ఎలా ఉండాలి’ అని ఆమె బదులిచ్చారు. జాగృతిని గ్రామాలకు విస్తరిస్తానని, ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. 2047 నాటికి ఫ్రీ&క్వాలిటీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అందించడమే తన విజన్&మిషన్ అని పేర్కొన్నారు.

News December 15, 2025

ICC ప్లేయర్స్ ఆఫ్ ది మంత్‌గా షెఫాలీ, హార్మర్

image

ఈ ఏడాది వన్డే WC ఫైనల్లో రాణించిన భారత మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (నవంబర్) అవార్డు గెలుచుకున్నారు. ప్రతీకా రావల్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన వర్మ.. ఫైనల్లో 87 రన్స్&2 వికెట్లు తీసి భారత్ గెలుపులో కీలకమయ్యారు. మరోవైపు పురుషుల విభాగంలో సౌతాఫ్రికా స్పిన్నర్ హార్మర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు సొంతం చేసుకున్నారు. టీమ్ ఇండియాతో జరిగిన రెండు టెస్టుల్లో ఆయన 17 వికెట్లు తీశారు.