News May 11, 2024

మోదీ తర్వాతి టార్గెట్ యోగి: కేజ్రీవాల్

image

ప్రధాని మోదీ చాలామంది నేతల రాజకీయ జీవితాలకు ముగింపు పలికారని ఢిల్లీ CM కేజ్రీవాల్ ఆరోపించారు. LK.అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ, సుమిత్రా మహాజన్, శివరాజ్‌సింగ్ చౌహాన్‌ విషయాల్లో చేసినట్లే UP CM యోగి ఆదిత్యనాథ్‌ రాజకీయ జీవితానికీ మోదీ ముగింపు చెబుతారని జోస్యం చెప్పారు. మోదీ తర్వాతి టార్గెట్ యోగినే అని కేజ్రీవాల్ అన్నారు. ఈసారి BJP గెలిస్తే 2నెలల్లో యోగిని భర్తీ చేస్తారని తాను రాసిస్తానని సవాల్ చేశారు.

Similar News

News February 8, 2026

బర్డ్ ఫ్లూతో భారీగా కోళ్లు మృతి.. చికెన్ తినొచ్చా?

image

AP: అన్నమయ్య(D) సదుం(M) పుత్తవారిపల్లె, అమ్మగారిపల్లె, కంభంవారిపల్లెల్లో వందల సంఖ్యలో కోళ్లు చనిపోగా పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. కోళ్ల శాంపిల్స్‌ను భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపగా బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయిందని అధికారులు పేర్కొన్నారు. బర్డ్‌ఫ్లూతో భయాందోళనలు వ్యక్తం అవుతున్న వేళ వారు కీలక సూచనలు చేశారు. 100 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతతో వేడి చేసిన చికెన్‌, గుడ్లను తినొచ్చని చెప్పారు.

News February 8, 2026

మున్సిపల్ ఎన్నికలు.. వైన్స్, బార్లు బంద్

image

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ వైన్స్, బార్లు బంద్ కానున్నాయి. అన్ని మున్సిపాలిటీలలో ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అటు ఫలితాలు వెల్లడయ్యే 13వ తేదీ కూడా బంద్ పాటించాలని ఆదేశించింది. ఈ నెల 11వ తేదీ ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

News February 8, 2026

పసికూనల పోరాటం అదుర్స్

image

T20WCలో పసి కూనలనుకున్న దేశాలు ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. విజయాలు సాధించకపోయినా ప్రేక్షకుల మనసులు గెలుస్తున్నాయి. నెదర్లాండ్స్‌పై పాక్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. WIపై స్కాట్లాండ్ 35 రన్స్ తేడాతో ఓడింది. INDపై USA 29 రన్స్ తేడాతో ఓడిపోయింది. తాజాగా ENGపై నేపాల్ గెలిచినంత పని చేసి నాలుగే రన్స్ తేడాతో ఓడింది. గెలవాలన్న కసితో ఈ జట్లు ఆడిన తీరు క్రికెట్ అభిమానులను మెస్మరైజ్ చేసింది.