News March 26, 2024
ఆ రోజున అకౌంట్లోకి డబ్బులు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల డీఏ పెంచగా.. ఎరియర్స్ జమ కావడంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త డీఏ కలపడంతో పెరిగిన జీతాలు, HRA, రెండు నెలల ఎరియర్స్ మార్చి 30వ తేదీన జమ కానున్నట్లు సమాచారం. కాగా 4శాతం డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం డీఏ 50శాతానికి పెరిగింది. దీని ద్వారా 48.67 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
Similar News
News February 15, 2026
ఆశ్రమ పాఠశాలలో ఏం జరుగుతోంది..?

పోలవరం(D) ఆశ్రమ పాఠశాలలో వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతుండటం కలవరపరుస్తోంది. జిల్లాలో 78 ఆశ్రమ పాఠశాలలు ఉండగా దాదాపు అన్నిచోట్ల ఇవే పరిస్థితులు నెలకొన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవరపల్లి పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి సుమారు 100 మంది ఇటీవల ఆసుపత్రి పాలైయారు. ఈ ఘటన మరవక ముందే శుక్రవారం అడ్డతీగలలో అస్వస్థతతో 10 మంది ఆసుపత్రిలో చేరారు. పర్యవేక్షణ లోపమే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి.
News February 15, 2026
సోమవారం జీవీఎంసీలో పీజీఆర్ఎస్ రద్దు: కమిషనర్

విశాఖలో ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి, IFR-2026 కార్యక్రమం ఏర్పాట్లు, సమన్వయ సమావేశాలలో సంబంధిత అధికారిక కార్యక్రమాలలో జీవీఎంసీ అధికారులు పాల్గొనున్నారు. ఈ మేరకు సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, అన్ని జోనల్ కార్యాలయాలలో నిర్వహించాల్సిన PGRSను రద్దు చేసినట్టు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News February 15, 2026
హసీనా అప్పగింతపై BNP ఆశాభావం

షేక్ హసీనాను భారత్ అప్పగిస్తుందని ఇటీవల బంగ్లా ఎన్నికల్లో గెలిచిన BNP ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ అంశం ఇరుదేశాల మధ్య సంబంధాలకు అడ్డుగా మారకూడదని ఆ పార్టీ నేత మీర్జా ఫక్రుల్ చెప్పారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఆమెను అప్పగించాలని ఇప్పటికే INDను కోరినట్లు తెలిపారు. బంగ్లాలో అల్లర్ల కారణంగా 2024లో హసీనా పారిపోయి భారత్‌కు వచ్చారు. తర్వాత ఢాకా అల్లర్ల కేసులో అక్కడి కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది.


