News April 10, 2024

CM కేజ్రీవాల్‌కు మరిన్ని కష్టాలు!

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే తిహార్ జైలులో ఉన్నారు. అయితే.. ఈకేసులో ఆయనకు వ్యతిరేకంగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ఈడీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జూన్‌లోగా ఆయన పేరును ఛార్జ్‌షీటులో చేర్చనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Similar News

News December 5, 2025

నెల్లూరు: రౌడీ షీటర్ పై PD యాక్ట్ నమోదు

image

రౌడీ షీటర్ జయప్రకాశ్‌ పై PD యాక్ట్ నమోదైనట్లు SP డా.అజిత వేజెండ్ల తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. నిందితుడు 2022లో PD యాక్ట్ కేసులో సంవత్సరం జైలుకెళ్లాడు. వేదాయపాలెం పోలీస్ స్టేషన్‌లో 1 రౌడీ షీట్, 3 హత్య, 2 హత్యాయత్నం, 8 రక్త గాయాలు చేసిన కేసులు అతనిపై ఉన్నాయి. సుమారు 14 రకాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. జైలుకెళ్లి వచ్చినా అతను తీరు మార్చుకోకపోవంతో కేసు నమోదైంది.

News December 5, 2025

అఖండ-2 సినిమా రిలీజ్ వాయిదా

image

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ-2 మూవీ విడుదల వాయిదా పడింది. రేపు రిలీజ్ కావాల్సిన సినిమాను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తెలిపింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ట్వీట్ చేసింది. ఈ సినిమా <<18466572>>ప్రీమియర్స్‌<<>>ను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించగా తాజాగా రిలీజ్‌ను కూడా వాయిదా వేశారు.

News December 5, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను రిసీవ్ చేసుకున్న ప్రధాని మోదీ
*హార్టికల్చర్‌ హబ్‌కి కేంద్రం రూ.40వేల కోట్లు ఇస్తోంది: చంద్రబాబు
*తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతుంది: జగన్
*ఏడాదిలోగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభం: రేవంత్
*’హిల్ట్’ పేరుతో కాంగ్రెస్ భూకుంభకోణం: KTR
*మరోసారి కనిష్ఠానికి రూపాయి.. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూ.90.43కి పతనం