News October 7, 2025
Most Prestigious.. జూబ్లీహిల్స్ బైపోల్

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో HYD జూబ్లీహిల్స్ బైపోల్ అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ తర్వాత వచ్చే అన్ని ఎలక్షన్లలో ఇక ఆ పార్టీదే హవా ఉంటుందనే చర్చ స్థానికంగా జోరుగా నడుస్తోంది. ఇప్పటికే BRS అభ్యర్థిగా మాగంటి సునీతను KCR ప్రకటించగా కాంగ్రెస్ నుంచి ముగ్గురు, BJP నుంచి ముగ్గురు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. రేపటిలోపు అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Similar News
News January 19, 2026
నిజామాబాద్‌లో 13.2°C ఉష్ణోగ్రత

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. నిజామాబాద్‌లో అత్యల్పంగా 13.2°C, సాలూరాలో 13.2, చిన్న మావంది 13.5, ఏర్గట్ల 14.0, మెండోరా 14.1, మంచిప్ప 14.4, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్ 14.5, బాల్కొండ, వేంపల్లి 14.6, మదన్ పల్లె 14.7, గోపన్న పల్లి 14.9°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News January 19, 2026
RR: 5 విడతల్లో సర్పంచ్‌లకు శిక్షణ

ఈ నెల19 నుంచి 23 వరకు నూతన సర్పంచ్‌లకు మొదటి విడతలో శిక్షణను ఇవ్వనున్నారు. మొదటి విడతలో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీలకు శిక్షణ ఇవ్వనున్నారు. 2వ విడతలో మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్, 3వ విడతలో కందుకూరు, నందిగామ, మహేశ్వరం, కేశంపేట, 4వ విడతలో ఫరూఖ్‌నగర్, కొత్తూరు, కొందుర్గు, చౌదరిగూడ, 5వ విడతలో అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, శంషాబాద్ సర్పంచ్‌లకు ఇవ్వనున్నారు.
News January 19, 2026
రాష్ట్ర స్థాయి అధికారిగా మన అనంత జిల్లా వాసి

ఏపీ RTI కమీషనర్‌గా అనంతపురానికి చెందిన గాజుల ఆదెన్న నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. గాజుల ఆదెన్న మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఈయన అనంతపురం నగర పాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పని చేశారు.


