News March 16, 2025
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హత్య

లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అబు ఖతల్ నిన్న రాత్రి పాకిస్థాన్‌లో హత్యకు గురయ్యాడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులకు మాస్టర్ మైండ్ అయిన హఫీజ్ సయీద్‌కు ఇతడు దగ్గరి అనుచరుడు. సయీద్ ఆదేశాలతో J&Kలోని మైనారిటీలు, భద్రతా బలగాలపై దాడులకు పాల్పడ్డాడు. ఖతల్ పర్యవేక్షణలోనే రియాసీ జిల్లాలోని భక్తుల బస్సుపై దాడి జరిగింది. ఇందులో 9 మంది మరణించారు. ఖతల్ కోసం NIA ఎప్పటినుంచో వెతుకుతోంది.
Similar News
News February 18, 2026
ఈ అలవాట్లతో బరువు తగ్గొచ్చు

కండరాల నిర్మాణం, బలం కోసం ప్రోటీన్ ఉన్న ఆహారం తినాలి. ముఖ్యంగా చికెన్, సీ ఫుడ్, ఎగ్స్, సోయా, నట్స్, సీడ్స్ వంటి లీన్ ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి. మటన్ వంటి మాంసాహారం తగ్గించాలి. దీంతో బరువు అదుపులో ఉంటుంది. క్యారెట్లు, ముల్లంగి, బీట్రూట్, మెంతికూర, పాలకూర ఎక్కువగా తింటే పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు కరుగుతుంది. సీజనల్ ఫ్రూట్స్, తగినంత నీరు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News February 18, 2026
ఎLAW: చిల్లుపై బిల్లుతో పోరాడవచ్చు

హోటళ్లలో ఫుడ్ తిన్నాక అస్వస్థతకు గురైతే ఆ మేనేజ్మెంట్‌ను తిట్టుకుని, డాక్టర్‌ను కలిసి మెడిసిన్ వేసుకుని సరిపెట్టుకుంటాం. కానీ మనకు జరిగిన శారీరక, ఆర్థిక, మానసిక నష్టానికి పరిహారం పొంది చట్టపర చర్యలతో మరోసారి, మరొకరికి ఇలా జరగకుండా చూడొచ్చు. దీనికి కావాల్సింది మీ ఫుడ్ బిల్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్. వీటితో ఫుడ్ సేఫ్టీ అథారిటీలో లేదా కోర్టులో కేసు వేయొచ్చు. కాబట్టి డబ్బు చెల్లించగానే బిల్ పడేయకండి.
News February 18, 2026
ఆత్మ గౌరవం కోసం మార్గదర్శకాలు

– నీ మాటలకు విలువ లేని చోట మౌనంగా ఉండటమే శ్రేయస్కరం.
– నిన్ను గౌరవించని ప్రదేశంలో ఒక్క క్షణం కూడా నిలబడకూడదు.
– ప్రేమ లేని చోట దాని కోసం ఆశ పడటం వ్యర్థం.
– నీకు నచ్చని, నువ్వు తప్పు చేయని విషయాలకు అనవసరంగా క్షమాపణలు చెప్పకు.
– నీకు నచ్చని పనుల గురించి ఇతరులకు వివరణలు ఇస్తూ కూర్చోకు.


