News April 2, 2024
MP ఎన్నికలు: మెదక్‌లో వీళ్లు ఓటేస్తే విజయమే..!

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నియోజకవర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 18,19,397 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 19 ఏండ్ల వయస్సు ఓటర్లు 53,458 మంది, 30 సం.లోపు 3,96,228 మంది, 40 సం.లోపు ఉన్నవారు 5,02,897 మంది ఉన్నారు. నాలుగు పదుల వయస్సు దాటనివారు మొత్తం 9.53 లక్షల మంది ఉన్నారు. అభ్యర్థుల గెలుపు ఓటముల్లో యువతే కీలకం కానుంది. మరి మీ ఓటు ఎటువైపు?
Similar News
News February 10, 2026
మెదక్: 686 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్త్: ఎస్పీ

మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలటీల పరిధిలో బందోబస్త్ ఏర్పాటు చేసినట్టు ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. 74 వార్డులు, 148 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం 686 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. 17 రూట్లలో మొబైల్ పార్టీ, సీఐల ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ టీమ్స్, నలుగురు డీఎస్పీల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్సులను ఏర్పాటు చేశామన్నారు.
News February 10, 2026
MDK: గాంధీనగర్ 18వ వార్డులో కలెక్టర్ ఓటు

మెదక్ మున్సిపాలిటీ గాంధీనగర్ 18వ వార్డులో కలెక్టర్ రాహుల్ రాజ్ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులు కలెక్టర్‌కు పోలింగ్ స్లిప్ అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఓటర్ స్లిప్‌ల పంపిణీ కొనసాగుతోందన్నారు. షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సూచించారు.