News April 2, 2024

MP ఎన్నికలు: హైదరాబాద్‌‌లో తీవ్ర పోటీ..!

image

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజధానిలో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి‌‌, హైదరాబాద్‌లో అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజాఆశీర్వాదం అంటూ బీజేపీ, ప్రజాపాలన అంటూ కాంగ్రెస్, కేంద్రంలో తెలంగాణ గళం పేరిట బీఆర్ఎస్‌ నేతలు ఓటర్లను ఆకర్శించే పనిలో పడ్డారు. మూడు ప్రధాన పార్టీల్లో అభ్యర్థులు బలంగా ఉండడంతో‌ తీవ్ర పోటీ నెలకొంది.

Similar News

News February 16, 2026

BREAKING: కడ్తాల్ వద్ద రెండు కార్లు ఢీ.. ఇద్దరి దుర్మరణం

image

కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్కల్ పహాడ్ గేట్ సమీపంలో ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. NH 765పై రెండు కార్లు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కార్లలో ప్రయాణిస్తున్న నరేంద్ర చారి (37), ఎస్‌కే సైదులు (30) అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 13, 2026

BREAKING: రంగారెడ్డిలో హోరాహోరి.. ఫలితాలు ఇవే!

image

రంగారెడ్డిలోని 6 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, BRS హోరాహోరీగా నిలిచాయి. మొత్తం 6 మున్సిపాలిటీల్లో 126 వార్డులు ఉండగా 54 కాంగ్రెస్, 47 బీఆర్ఎస్, 16 బీజేపీ, 9 మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఆమన్‌గల్‌ BRS, ఇబ్రహీంపట్నం BRS, షాద్‌నగర్ INC, శంకర్‌పల్లి INC, చేవెళ్లలో INC సత్తాచాటాయి. మొయినాబాద్‌ ఒక్క చోట హంగ్ ఏర్పడింది. అటు మేడ్చల్‌లోని అలియాబాద్‌ మున్సిపాలిటీలోనూ హంగ్ వచ్చింది.