News March 26, 2024
ఎంపీ బరిలో కుమారస్వామి

జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మండ్య పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బీజేపీతో పొత్తులో భాగంగా తమ పార్టీ మండ్య, కోలార్, హాసన్ స్థానాల నుంచి పోటీ చేస్తుందని కుమారస్వామి స్పష్టం చేశారు. 28 ఎంపీ స్థానాలు ఉన్న కర్ణాటకలో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో పోలింగ్ జరగనుంది.
Similar News
News February 12, 2026
శివ నామాలు అర్థాలు ‘‘నటరాజ’’

శివుడు సమస్త కళలకు, నాట్యానికి అధిపతి. ఆయన చేసే తాండవం సృష్టి గమనాన్ని సూచిస్తుంది. శివుడు ‘ఆనంద తాండవం’ చేస్తున్నప్పుడు సృష్టి నిర్మాణం జరుగుతుందని, ‘రుద్ర తాండవం’ చేసినప్పుడు దుష్టశిక్షణ జరుగుతుందని చెబుతారు. ప్రపంచంలోని అణువణువూ ఆయన చలనం (నాట్యం) వల్లే కదులుతోందని కొందరు శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తారు. నాట్య కళ ద్వారా విశ్వ రహస్యాలను వెల్లడించే ఈ సార్వభౌముడిని ‘నటరాజు’గా మనం కొలుచుకుంటాం.
News February 12, 2026
మహిళల్లో అధిక మూత్ర విసర్జనకు కారణాలివే..

వయసు తక్కువగా ఉన్నా కూడా అతిగా మూత్రవిసర్జనకు వెళ్తుంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కారణమంటున్నారు నిపుణులు. పెల్విక్ నొప్పి, పీరియడ్స్‌లో బ్లీడింగ్ ఎక్కువగా అవడం, మెనోపాజ్ వల్ల ఇలా జరుగుతుందంటున్నారు. అలాగే మూత్రం ఆపుకోలేకపోవడానికి పునరుత్పత్తి, మూత్ర అవయవాల నిర్మాణం, కాన్పులు, నెలసరి నిలిచాక హార్మోన్ల మార్పుల వంటివి కారణం. దీన్ని నివారించడానికి కెగెల్ వ్యాయామాలు ఉపయోగపడతాయంటున్నారు.
News February 12, 2026
పంచాయతీలకు మరో రూ.387 కోట్లు

TG: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇటీవల రూ.259 కోట్లు <<19056099>>విడుదల<<>> చేసిన 15వ ఆర్థిక సంఘం తాజాగా మరో రూ.387 కోట్లను రిలీజ్ చేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం రూ.646 కోట్లను ఇచ్చినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. ఇంకా రూ.2,400 కోట్ల నిధులు పెండింగులో ఉన్నాయని, వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని మంత్రి సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.


