News August 21, 2025
MTM: గృహ నిర్మాణం, కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష

బందరులో కలెక్టర్ బాలాజీ గృహ నిర్మాణం, కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. గృహ నిర్మాణాల గడువు వచ్చే మార్చి 31వరకు పొడిగించినట్లు తెలిపారు. జిల్లాలో 2.36లక్షల పింఛన్లలో 4,332 అనర్హులైన దివ్యాంగుల పింఛన్లు ఆపివేసినట్లు పేర్కొన్నారు. వాళ్లల్లో అర్హులకు మళ్లీ అందిస్తామని తెలిపారు. స్వామిత్వ భూముల రికార్డుల ఆన్‌లైన్ ప్రక్రియ 20% పూర్తై, డిసెంబర్‌లో 100% చేస్తామన్నారు.
Similar News
News January 23, 2026
నందమూరులో మూడో రోజు జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్

నందమూరులోని శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు మూడో రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం సెషన్‌లో 180 మందికి గాను 172 మంది విద్యార్థులు హాజరుకాగా, 8 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన రెండో సెషన్‌లో 180 మందికి గాను 174 మంది విద్యార్థులు పరీక్ష రాశారని, ఆరుగురు హాజరు కాలేదని కళాశాల ప్రిన్సిపల్ వెల్లడించారు.
News January 23, 2026
ఓటు నమోదులో యువతే లక్ష్యం: కలెక్టర్

ఎన్నికల ప్రక్రియలో యువతను భాగస్వాములను చేయడమే లక్ష్యమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బాలాజీ అన్నారు. జనవరి 25న జరగనున్న 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మచిలీపట్నంలో ప్రభుత్వ ఉద్యోగులతో ఆయన ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేస్తామని సిబ్బంది ప్రమాణం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
News January 23, 2026
గన్నవరంలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సును విజయవంతంగా ముగించుకుని వచ్చిన CM చంద్రబాబుకు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు పలువురు నేతలు ఆయనకు పూలమాలలతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో దాదాపు రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రులు హర్షం వ్యక్తం చేశారు.


