News February 7, 2025
MUDA SCAM: సిద్దరామయ్యకు స్వల్ప ఊరట

ముడా స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు కొంత ఊరట లభించింది. ఈ కేసు దర్యాప్తును లోకాయుక్త నుంచి సీబీఐకి బదిలీ చేసేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. ‘లోకాయుక్త దర్యాప్తు బాగాచేయడం లేదనేలా, లోతైన దర్యాప్తు కోసం సీబీఐకి బదిలీ చేయాలనేలా మెటీరియల్ ఎవిడెన్స్ ప్రతిబింబించడం లేదు’ అని జస్టిస్ నాగప్రసన్న తెలిపారు. దీంతో పిటిషనర్ స్నేహమయీ కృష్ణ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు.
Similar News
News February 19, 2026
కోడి రెక్క ఆరబెడితే గొప్ప వర్షం

వర్షం పడబోయే ముందు గాలిలో తేమ పెరగడంతో పాటు వాతావరణంలో కొన్ని మార్పులు వస్తాయి. కోళ్లు వీటిని గ్రహించి తమ రెక్కలను విరబోసుకుని (ఆరబెట్టినట్లుగా) ఆడిస్తాయట. కోళ్లు అలా ప్రవర్తిస్తే, త్వరలోనే భారీ వర్షం కురుస్తుందని గ్రామాల్లోని ప్రజలు నమ్మేవారట. దీంతో పాటు నల్ల చీమలు వరుసగా వెళ్లటం, కప్పల బెకబెకలను విని.. వ్యవసాయ పనుల కోసం సిద్ధమయ్యే రైతులు తమ ధాన్యాన్ని, ఇతర వస్తువులను భద్రపరుచుకొనేవారట.
News February 19, 2026
శని, మంగళవారాల్లో కొనకూడని వస్తువులు

ఈ రెండ్రోజులు నువ్వులు, గుడ్లు, ఉప్పు, మిరియాలు, చెప్పులు కొనకూడదట. శాస్త్రాల ప్రకారం ఇవి నిషిద్ధమని పండితులు చెబుతున్నారు. ‘శనివారం నాడు ఇనుము, నూనె, చెప్పులు కొంటే శని ప్రభావం పెరిగి కష్టాలొస్తాయి. ఉప్పు, మిరియాలు గొడవలకు సంకేతాలు’ అంటున్నారు. ఈ నియమాలు పాటిస్తే అనవసర ఆర్థిక నష్టాలు, గొడవలు కలగకుండా ఉంటాయని నమ్మకం. ఈ రెండ్రోజులు సాత్వికాహారం తీసుకొని దానధర్మాలు చేస్తే శుభ ఫలితాలుంటాయని నమ్మకం.
News February 19, 2026
కరెంట్ అఫైర్స్

– భారత ఎయిర్‌ఫోర్స్ డే: అక్టోబర్ 8
– అశోకచక్ర 2026ను పొందినది: శుభాంశు శుక్లా
– దేశంలో తొలి బాల్య వివాహ రహిత జిల్లా: బలోద్ (MP)
– హ్యూమనాయిడ్ రోబో ARJUN గల రైల్వే స్టేషన్: విశాఖపట్నం
– డ్రైవర్ రహిత మెట్రో రైలు ట్రయల్ జరిగిన నగరం: చెన్నై
– ఉద్యోగినులకు నెలసరి సెలవు తప్పనిసరి చేసిన రాష్ట్రం: కర్ణాటక
> రోజూ ఉదయం 5amకు కరెంట్ అఫైర్స్ పొందండి


