News April 2, 2024

ముంబై చెత్త రికార్డు

image

ఇప్పటికే వరుస ఓటములతో డీలాపడ్డ ముంబైని చెత్త రికార్డులు వెంటాడుతున్నాయి. రాజస్థాన్‌‌తో మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన MI కేవలం 125 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈ సీజన్‌లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 15.3ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. అంతకుముందు చెన్నైతో మ్యాచ్‌లో గుజరాత్ 143/8 నమోదు చేసింది. దాన్ని ముంబై చెరిపేసింది.

Similar News

News February 16, 2026

విజయ్- రష్మిక పెళ్లికార్డు వైరల్!

image

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక వివాహం ఈనెల 26న జరగనున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రిక ఒకటి వైరలవుతోంది. మార్చి 4న 7PMకి హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో రిసెప్షన్ జరగనుందని అందులో పేర్కొన్నారు. పెళ్లిని బంధువుల సమక్షంలో చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై VD టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

News February 16, 2026

టెక్నాలజీతో పౌర సేవకు బిల్‌గేట్సే ప్రేరణ: సీఎం

image

AP: రాష్ట్రంలోని ప్రజల జీవితాలను రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్(RTGS) మారుస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీ మానవాళికి ఉపయోగపడాలన్నారు. 1990లలో బిల్‌గేట్స్‌తో మీటింగ్ తర్వాత సాంకేతికత ద్వారా పౌర సేవకు ప్రేరణ కలిగిందని Xలో గుర్తు చేసుకున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయంతో సహా అనేక కార్యక్రమాలతోపాటు యంగ్ మైండ్స్‌తో నిండిఉన్న RTGS కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించడం సంతోషంగా ఉందని చెప్పారు.

News February 16, 2026

650 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>RBI <<>>650 అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి మార్చి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రిలిమినరీ, మెయిన్స్, LPT ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.29,000-రూ.78,640 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.450+GST, SC,ST, PwBDలకు రూ.50+GST. వెబ్‌సైట్: https://rbi.org.in./