News February 11, 2025

OpenAIను కొనేందుకు మస్క్ ఆఫర్

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ OpenAIపై ఎలాన్ మస్క్ కన్నేశారు. ఆయన నేతృత్వంలోని ఇన్వెస్టర్లు 97.4 బిలియన్ డాలర్లకు OpenAIను కొనుగోలు చేసేందుకు ఆ కంపెనీ బోర్డుకు ఆఫర్ చేశారు. ఈ ఆఫర్‌ను ఆ సంస్థ సీఈవో ఆల్ట్‌మన్ తిరస్కరించారు. కాగా మస్క్ అప్పట్లో ఈ కంపెనీలో భాగస్వామిగా ఉండేవారు. దీన్ని నాన్-ప్రాఫిట్ నుంచి ప్రాఫిట్ కార్పొరేషన్‌గా మార్చాలని ఆల్ట్‌మన్ నిర్ణయం తీసుకోవడంతో మస్క్ వైదొలిగారు.

Similar News

News February 13, 2026

దేశవ్యాప్తంగా సిట్టింగ్ జడ్జిలపై 8,630 ఫిర్యాదులు

image

గత దశాబ్ద కాలంలో సిట్టింగ్ జడ్జిలపై భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి 8,630 ఫిర్యాదులు వచ్చాయని కేంద్రం ఇవాళ లోక్‌సభలో వెల్లడించింది. ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 2024లో మాజీ CJI చంద్రచూడ్, మాజీ CJI సంజీవ్ ఖన్నా పదవీ కాలంలో ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయని తెలిపింది. పదేళ్ల గణాంకాలు చూస్తే ఎక్కువగా 2022లో 1,012, 2023లో 977, 2024లో 1,170, 2025లో 1,102 ఫిర్యాదులు నమోదయ్యాయంది.

News February 13, 2026

ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్!

image

AP: చేనేతలందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి సవిత తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు శాసనమండలిలో వెల్లడించారు. చేనేత వృత్తిలో ఉన్న వారందరూ అర్హులేనని పేర్కొన్నారు. మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మర మగ్గం నేతన్నలకు 500 యూనిట్లు ఫ్రీగా ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో మగ్గం నేతన్నలకు ఏడాదికి రూ.8,640, మర మగ్గం నేతన్నలకు రూ.21,600 ఆదా కానుందని మంత్రి చెప్పారు.

News February 13, 2026

కానిస్టేబుల్‌ సస్పెండ్.. గెలిచిన భార్య!

image

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనే ఆరోపణలతో సస్పెండైన కానిస్టేబుల్‌ భార్య గెలిచారు. సిద్దిపేట(D) చేర్యాల మున్సిపాలిటీ 2వ వార్డులో BRS తరఫున గీతాంజలి పోటీ చేశారు. ఆమె భర్త రమేశ్ కొమురవెళ్లి PSలో కానిస్టేబుల్‌. ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదు వెళ్లడంతో విధుల నుంచి రమేశ్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో గీతాంజలి కాంగ్రెస్ అభ్యర్థి ముస్త్యాల తేజపై 223 ఓట్ల తేడాతో గెలిచారు.