News April 26, 2024

‘హీరామండీ’తో నా కల నెరవేరింది: బాలీవుడ్ నటి

image

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించాలని ఉండేదని.. ఆ కల ‘హీరామండీ’తో నెరవేరిందని చెప్పారు. పవర్ ఫుల్ డార్క్ క్యారెక్టర్లలో నటించడమంటే తనకు చాలా ఇష్టమన్నారు. తన నాన్న శత్రుఘ్నసిన్హాను స్ఫూర్తిగా తీసుకొని హీరామండీలో నటించినట్లు తెలిపారు. ఈ సిరీస్‌లో ఫరీదాన్ పాత్రకు తనను ఎంపిక చేసినందుకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News April 16, 2026

నారాయణపేట: జీతాలు ఇవ్వకుంటే విధుల బహిష్కరణ

image

నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను విడుదల చేయాలని కోరుతూ నారాయణపేట జిల్లా సాంకేతిక సహాయకుల జేఏసీ ప్రతినిధులు జిల్లా డీఆర్డివో మొగులప్పకు వినతిపత్రం అందజేశారు. వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే మంగళవారం నుంచి పెన్‌డౌన్ నిర్వహిస్తామని జిల్లా నాయకులు హర్షవర్ధన్,గౌరీశంకర్, ఊషన్న, శంకర్ తెలిపారు.

News April 16, 2026

రాత్రి బ్రష్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా?

image

రాత్రి నిద్రకు ముందు బ్రష్ చేయడం ఎంతో ముఖ్యమని వైద్యులు సూచించారు. ‘రోజంతా తిన్న ఆహారం, చక్కెర దంతాలపై ఒక పొరలా పేరుకుపోతాయి. రాత్రి బ్రష్ చేయకపోతే గంటల తరబడి అలాగే ఉండి బాక్టీరియా పెరుగుతుంది. అది ఎనామెల్‌ను దెబ్బతీసి కావిటీస్, చిగుళ్ల సమస్యలకు దారి తీస్తాయి. నోటి దుర్వాసన పెరుగుతుంది. అందుకే రాత్రి భోజనం చేశాక నిద్ర పోయే ముందు బ్రష్ చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
Share It