News April 3, 2024

నాకిష్టమైన కోస్టార్ అతనే: మృణాల్ ఠాకూర్

image

తనతో నటించిన వారిలో తనకు ఇష్టమైన కోస్టార్ దుల్కర్ సల్మాన్ అని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అన్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్ ఈవెంట్‌లో ఆమె మాట్లాడారు. ‘సీతారామం’ షూటింగ్ సమయంలో దుల్కర్ అడుగడుగునా ధైర్యానిచ్చారని తెలిపారు. ఆయన వల్లే సీత పాత్ర చేయగలిగానని చెప్పారు. పలు భాషల్లో నటిస్తున్నానంటే కారణం దుల్కర్ ఇచ్చిన స్ఫూర్తి అని పేర్కొన్నారు.

Similar News

News February 19, 2026

వరుణ్.. నువ్వో వరం!

image

టీ20ల్లో టీమ్ ఇండియాకు వరుణ్ చక్రవర్తి వరంలా మారారు. గత 29 టీ20ల్లో 28 మ్యాచుల్లో అతడు వికెట్లు పడగొట్టడం విశేషం. ఒక్క మ్యాచులో మాత్రమే వికెట్లు తీయలేదు. కీలక సమయాల్లో తన మిస్టరీ బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించడం వరుణ్ స్పెషల్. ఈ ప్రపంచకప్‌లోనూ మిగతా బౌలర్లు వికెట్లు తీయలేక ఇబ్బందులు పడుతుంటే వరుణ్ వరుసగా వికెట్లు తీస్తూ భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

News February 19, 2026

భారీగా తగ్గిన రష్యన్ ఆయిల్ దిగుమతులు

image

భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా భారీగా తగ్గింది. ఒకప్పుడు 40% ఉన్న షేర్ ఇప్పుడు 21.1%కు పడిపోయింది. జనవరిలో రోజుకు 1.1 మిలియన్ బ్యారెళ్ల చమురును మాత్రమే దిగుమతి చేసుకుంది. 2022 నవంబరు తర్వాత ఇంత తక్కువ దిగుమతులు చేసుకోవడం ఇదే తొలిసారి. మార్చిలో ఈ దిగుమతి రోజుకు 8లక్షల బ్యారెళ్లకు పడిపోవచ్చని అంచనా. మరోవైపు జనవరి చమురు దిగుమతుల్లో మిడిల్ ఈస్ట్ వాటా దాదాపు 55%గా నమోదైంది.