News March 26, 2024

నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు: ఎమ్మెల్యే

image

TG: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హీటెక్కిస్తుండగా.. తన ఫోన్ కూడా గతంలో ట్యాప్ చేశారని మహబూబ్‌నగర్ MLA శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ‘దీనిపై DGPకి ఫిర్యాదు చేశా. గత ప్రభుత్వం ప్రశ్నించే వందల మంది ఫోన్లు ట్యాప్ చేసింది. మా కాల్ రికార్డులను గత ప్రభుత్వ పెద్దలకు పంపారు. ప్రతి ట్యాపింగ్ ఫిర్యాదుపై లోతుగా విచారించాలి. గత ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ వ్యవహారంలో ఉన్నారు’ అని ఆరోపించారు.

Similar News

News February 13, 2026

ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా.. ఇది మర్చిపోవద్దు!

image

భారతీయ రైల్వే 45 పైసలకే ₹10 లక్షల దాకా ఇన్సూరెన్స్ ఇస్తోందని తెలుసా? ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే వారికి ఈ సర్వీసును అందిస్తోంది. ప్రమాదంలో మరణించినా/శాశ్వత వైకల్యం ఏర్పడినా ₹10 లక్షలు, పాక్షిక వైకల్యానికి ₹7.5 లక్షలు, గాయపడితే ₹2 లక్షలు అందిస్తుంది. మృతదేహం తరలింపుకు ₹10 వేలు ఇస్తుంది. బుకింగ్ సమయంలో ఇన్సూరెన్స్ కోసం నామినీ వివరాలు ఎంటర్ చేయడం మర్చిపోవద్దు.

News February 13, 2026

తమలపాకులతో ఇలా చేస్తే..

image

‘నాగవల్లి దళాలు’ అని పిలిచే తమలపాకులు అతి పవిత్రమైనవి. ఈ ఆకులో లక్ష్మీ, పార్వతి, సరస్వతి దేవతలు ఉంటారని పురాణాల వాక్కు. అందుకే శుభకార్యాల్లో తాంబూలం సమర్పిస్తారు. ఇది సంపూర్ణతకు నిదర్శనం. సీతాదేవి ఆశీస్సుల వల్ల హనుమాన్‌కి ఇవంటే చాలా ప్రీతి. ఆయనను వీటితో పూజిస్తే శని దోషాలు పోతాయని నమ్మకం. అలాగే వీటికి ఔషధ గుణాలెన్నో! జీర్ణక్రియకు చాలా మేలు చేస్తాయి. పూజలో తాజాగా, తొడిమ ఉన్న ఆకులను వాడటం ఉత్తమం.

News February 13, 2026

కోళ్లలో కొక్కెర వ్యాధి – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

కోళ్ల షెడ్డును శుభ్రంగా ఉంచి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. సంతలో కొన్న పెట్టలను, పుంజులను టీకాలు వేయకుండా షెడ్డులో కోళ్లతో కలిపి ఉంచకూడదు. పెద్ద, చిన్న కోళ్లను వేరువేరుగా ఉంచాలి. వెటర్నరీ నిపుణుల సూచనలతో కోడిపిల్లలు పుట్టిన తొలి వారంలోనే F1(RD)/Lasota టీకా మందు కంటిలో/ముక్కులో వేస్తే 6 వారాల వరకు ఈ కొక్కెర వ్యాధి రాదు. కోళ్లకు ఆరు వారాల వయసులో R2B (R.D.) వ్యాక్సిన్ 0.5 ml s/c వేయాలి.