News April 20, 2024
నా భార్యకు టాయిలెట్ క్లీనర్ కలిపిన ఆహారం ఇస్తున్నారు: ఇమ్రాన్

తన భార్య బుష్రా బీబీకి టాయిలెట్ క్లీనర్ కలిపిన ఆహారాన్ని ఇస్తున్నారని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ప్రస్తుతం ఆయన రావల్పిండిలోని జైల్లో ఉండగా, బీబీ గృహనిర్బంధంలో ఉన్నారు. ‘విషపూరిత ఆహారం కారణంగా బీబీ పొట్టలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. తనకు ఏమైనా అయితే నేను బతికున్నంతకాలం జనరల్ అసీం మునీర్‌ను వదిలిపెట్టేది లేదు’ అని ఇమ్రాన్ పేర్కొన్నట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది.
Similar News
News December 15, 2025
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష.. చీఫ్ రాజీనామా

ప్రపంచంలోనే కఠినమైన పరీక్షలలో ఒకటైన సౌత్ కొరియా ‘సన్‌అంగ్’ మరోసారి వివాదంలో నిలిచింది. ఈ ఏడాది ఇంగ్లిష్ పేపర్‌పై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో సన్‌అంగ్ చీఫ్ ఓ సుంగ్ గియోల్ రాజీనామా చేశారు. ప్రతి ఏడాది నవంబర్‌లో జరిగే ఈ 8 గంటల పరీక్ష వర్సిటీల్లో ప్రవేశంతో పాటు ఉద్యోగావకాశాలను నిర్ణయిస్తుంది. 1993 నుంచి ఇప్పటివరకు నలుగురు మాత్రమే పూర్తి పదవీకాలం కొనసాగారు.
News December 15, 2025
మూడు దేశాల పర్యటనకు మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 15 నుంచి 18 వరకు మూడు దేశాల్లో పర్యటించనున్నారు. 15-16న జోర్డాన్, 16-17న ఇథియోపియా, 17-18న ఒమన్‌కు ఆయన వెళ్తారు. ‘లింక్ వెస్ట్’ పాలసీ, ‘ఆఫ్రికా ఇనిషియేటివ్’లో భాగంగా ఆ దేశాలతో వ్యూహాత్మక, ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెట్టనున్నారు. వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేసుకోనున్నారు.
News December 15, 2025
బిగ్‌బాస్ హౌస్‌లో టాప్-5 వీళ్లే

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. ఫైనల్‌కు మరో వారం మాత్రమే మిగిలి ఉండగా టాప్-5 ఫైనలిస్టులు ఖరారయ్యారు. తనూజ, డిమోన్ పవన్, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజన ఫైనల్ రేసులోకి అడుగుపెట్టారు. తాజాగా జరిగిన డబుల్ ఎలిమినేషన్‌లో శనివారం <<18553037>>సుమన్‌శెట్టి<<>> ఇంటి నుంచి బయటకు వెళ్లగా, ఆదివారం <<18559680>>భరణి<<>> ఎలిమినేట్ అయ్యారు. దీంతో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.


