News May 21, 2024

మరో లగ్జరీ కారును కొనుగోలు చేసిన నాగచైతన్య

image

నటుడు నాగచైతన్య తాజాగా పోర్షే 911 జీటీ3ఆర్ఎస్‌ కారును కొనుగోలు చేశారు. దీని ధర రూ.3.5 కోట్లని సమాచారం. కారు పక్కన చైతూ ఉన్న ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అత్యంత ఖరీదైన పలు లగ్జరీ కార్లు ఆయన సొంతం. వాటిలో రూ.4 కోట్లకు పైబడిన లంబోర్గినీ, ఫెరారీ, ల్యాండ్ రోవర్ తదితర సంస్థల కార్లున్నాయి. కాగా.. చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి డైరెక్షన్‌లో ‘తండేల్’లో నటిస్తున్నారు.

Similar News

News March 9, 2026

మేడ్చల్ జిల్లాలో రైతుల రిజిస్ట్రేషన్ 89% పూర్తి

image

మేడ్చల్ జిల్లాలో రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొంత గందరగోళంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM కిసాన్ రైతు రిజిస్ట్రేషన్‌ను అనుసంధానం చేయడంతో అగ్రికల్చర్ విస్తరణ అధికారులకు ఇది తలనొప్పిగా మారింది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనం అందనుంది. జిల్లాలో మొత్తం 19,589 మంది రైతులు ఉండగా ఇప్పటి వరకు సుమారు 89 శాతం మాత్రమే పూర్తైంది.

News March 9, 2026

BREAKING: భారీగా తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,960 తగ్గి రూ.1,61,680కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,800 పతనమై రూ.1,48,200 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.

News March 9, 2026

త్రిషకు సారీ చెప్పిన నటుడు పార్తీబన్

image

త్రిషను బయటకు రానివ్వకూడదంటూ తాను చేసిన <<19330179>>కామెంట్స్‌పై<<>> నటుడు, డైరెక్టర్ పార్తీబన్ విచారం వ్యక్తం చేశారు. ‘ఈవెంట్‌లో అంతా తప్పుగా జరిగింది. క్షమాపణ కోరడం తప్ప మరో మార్గం లేదు’ అని Xలో పోస్టు చేశారు. టీవీకే చీఫ్ విజయ్, త్రిష రిలేషన్ రూమర్స్ నేపథ్యంలో పార్తీబన్ చేసిన కామెంట్స్ వైరలైన విషయం తెలిసిందే. దీనిపై త్రిష కూడా <<19332584>>ఘాటుగా బదులివ్వడంతో<<>> ఆయన దిగి వచ్చారు.