News March 27, 2024

‘విరూపాక్ష’ డైరెక్టర్‌తో నాగచైతన్య సినిమా!

image

హీరో అక్కినేని నాగచైతన్య, డైరెక్టర్ కార్తీక్ దండు కాంబినేషన్‌లో త్వరలో ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. థ్రిల్లర్ కథతో రానున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చైతూ ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. కాగా కార్తీక్ దండు గత ఏడాది ‘విరూపాక్ష’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

Similar News

News February 17, 2026

ఈనెల 25న టీచర్ల సీనియారిటీ లిస్టులు

image

AP: టీచర్ల సీనియారిటీ జాబితాలు ఈ నెల 25న విడుదల కానున్నాయి. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన లిస్టులు సిద్ధం చేయాలని అధికారులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. 25న విడుదలయ్యే తొలి విడత జాబితాలపై అభ్యంతరాలను స్వీకరించి మార్చి 3న రెండో విడత, 15న మూడో విడత రిలీజ్ చేస్తారు. తుది జాబితాలను మార్చి 30న ప్రకటించి సీనియారిటీ ఖరారు చేస్తారు. వాటి ఆధారంగానే వేసవి సెలవుల్లో బదిలీలు జరుగుతాయి.

News February 17, 2026

‘రియల్’ దూకుడు.. తగ్గేదేలే!

image

దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి రూ.88 లక్షల కోట్లకు చేరనుందని KPMG-నరెడ్కో కన్సల్టెన్సీ సంస్థలు తెలిపాయి. గతేడాదితో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. అప్పుడప్పుడు ఆటుపోట్లు ఎదురైనా 2047 నాటికి మరింత పెరిగి రూ.616.7 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని ‘ది రోల్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఇన్ వికసిత్ భారత్-2047’ నివేదికలో వెల్లడించాయి. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో రియల్ రంగం వెన్నెముకగా మారనుందన్నాయి.

News February 17, 2026

దానిమ్మ పంట నాణ్యత, ఆదాయం పెంచే ‘క్రాప్ కవర్’

image

కొన్నిచోట్ల దానిమ్మ చెట్లపై తెల్లని కవర్ గమనించే ఉంటారు. వీటినే క్రాప్ కవర్స్ అంటారు. వీటిని ప్లాస్టిక్+నైలాన్‌తో తయారు చేస్తారు. ఈ కవర్ వల్ల పండు ఈగ, ఇతర చీడపీడల నుంచి పంటకు రక్షణ లభిస్తుంది. అలాగే మొక్క, కాయలపై అధిక ఎండ, చలి తీవ్రత పడకుండా ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. నేలలో తేమను నిలకడగా ఉంచి కలుపు బెడదను తగ్గిస్తుంది. ఫలితంగా తెగుళ్లు, మచ్చలు లేని నాణ్యమైన పంటతో పాటు అధిక ఆదాయం పొందవచ్చు.