News May 1, 2024
ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర

తెలుగు నటుడు నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాలో యాక్టింగ్‌కుగానూ ఆయన ‘దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’లో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. మరోవైపు శ్రీసింహ హీరోగా నటించిన ‘ఉస్తాద్’ మూవీకి ‘ఆనరరీ జ్యూరీ మెన్షన్’ విభాగంలో పురస్కారం దక్కింది. అంతకుముందు హారర్ మూవీగా తెరకెక్కిన ‘మా ఊరి పొలిమేర 2’ చిత్రం ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికైన సంగతి తెలిసిందే.
Similar News
News December 6, 2025
నేడు అమెరికాకు మంత్రి లోకేశ్

AP: పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ ఇవాళ్టి నుంచి 10వ తేదీ వరకు అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. తొలిరోజు డల్లాస్‌లోని తెలుగువారిని కలుస్తారు. 8, 9వ తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతారు. 10న టొరెంటోలో పర్యటిస్తారు. ఈ 18 నెలల్లో లోకేశ్ అమెరికా వెళ్లడం రెండోసారి కావడం విశేషం. ఇప్పటివరకు US, దావోస్, సింగపూర్ ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించారు.
News December 6, 2025
శ్రీశైలం: పాతాళగంగ నీరు పచ్చగా ఎందుకు?

చంద్రగుప్త మహారాజు ఓ రాజ్యాన్ని ఓడించి, అంతఃపురంలో ఉన్న రాణిని తన కూతురని తెలియక ఆశించాడు. ఆ విషయం తెలిసినా వెనక్కి తగ్గలేదు. దీంతో చంద్రవతి శ్రీశైలం వచ్చి శివుడిని ప్రార్థించింది. అక్కడకు వచ్చిన చంద్రగుప్తుడు చంద్రవతిని చెడగొట్టబోతుండగా, శివుడు ప్రత్యక్షమయ్యాడు. కామంతో కనులు మూసుకుపోయిన చంద్రగుప్తుడిని పచ్చలబండపై పాతాళగంగలో పడి ఉండమని శాపమిచ్చాడు. అందుకే పాతాళగంగ నీరు పచ్చగా ఉంటుందని కథనం.
News December 6, 2025
టాస్ గెలిస్తే.. సిరీస్ గెలిచినట్లే!

సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ 1-1తో సమమైన విషయం తెలిసిందే. విశాఖ వేదికగా ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ గెలవాలంటే టీమ్ ఇండియా ఇవాళ టాస్ గెలవాలి. మొదట బ్యాటింగ్ చేసి ఎంత భారీ స్కోర్ చేసినా.. రెండో ఇన్నింగ్స్‌లో మంచు దెబ్బకు బౌలింగ్ తేలిపోతోంది. ఇటీవల ఉమెన్స్ వరల్డ్ కప్‌లో విశాఖలో జరిగిన 5 ODIల్లో ఛేజింగ్ టీమే గెలిచింది. ఏ విధంగా చూసినా ఇవాళ్టి మ్యాచ్‌లో టాసే కీలకంగా కనిపిస్తోంది.


