News April 27, 2024
IREDAకు నవరత్న హోదా

ప్రభుత్వ రంగ సంస్థ IREDA (ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ) కేంద్రం నుంచి నవరత్న హోదా అందుకుంది. దీంతో IREDA ఇప్పుడు కేంద్రం అనుమతి అవసరం లేకుండానే రూ.1000కోట్ల వరకు నిధులు సమకూర్చుకోవచ్చు. పారిశ్రామిక రంగంలో మినీరత్న, నవరత్న, మహారత్న అనే హోదాలు ఉంటాయి. IREDA 2015లో మినీరత్న (కేటగిరీ-1) హోదా అందుకుంది. కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 17 PSUలకు నవరత్న హోదా ఉంది.
Similar News
News April 16, 2026
భగ్గుమన్న భానుడు.. సీజన్లో తొలిసారి..

తెలంగాణలో భానుడు నిప్పులు చిమ్ముతున్నాడు. ఈ సీజన్లో తొలిసారి ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. ఇవాళ అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 44.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో 44.3, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2-3 రోజులు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.
News April 16, 2026
మల్లె సాగు – దిగుబడి పెరగాలంటే..

మల్లె నాటిన 6 నెలల తర్వాత పూత ప్రారంభమై మొక్క పెరిగే కొద్ది దిగుబడి పెరుగుతుంది. మూడో ఏడాది నుంచి 12-15 సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది. తాజా పువ్వుల కోసం పూర్తిగా అభివృద్ధి చెంది తెరవని మొగ్గలను ఉదయాన్నే 11 గంటల లోపలే కోయాలి. లేకపోతే పువ్వుల నాణ్యత తగ్గిపోతుంది. దిగుబడి పెంచుటకు లీటర్ నీటికి జింక్ సల్ఫేట్ 2.5గ్రా, మెగ్నీషియం సల్ఫేట్ 5గ్రా. సూక్ష్మదాతువులను కలిపి 2,3 దఫాలుగా పిచికారీ చేయాలి.
News April 16, 2026
భార్యాభర్తల బంధం.. 5-5-5 రూల్‌తో పదిలం!

భార్యాభర్తలు గొడవలను దురుసుగా కాకుండా 5-5-5 రూల్‌తో పరిష్కరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఐదు నిమిషాలు భార్య మాట్లాడితే ఆ తర్వాత ఐదు నిమిషాలు భర్త మాట్లాడాలి.. మిగతా 5 నిమిషాలు పరిష్కారానికి కేటాయించాలనేది ఈ కాన్సెప్ట్. మొదటి పది నిమిషాల్లో ఒకరి మాటలను మరొకరు శ్రద్ధగా వినాలి. మధ్యలో కలగజేసుకోకూడదు. దీంతో పాటు రోజూ అభినందించుకోవడం, సాయపడటం వంటివి చేస్తే అనురాగం పెరిగి బంధం బలంగా ఉంటుంది.


