News April 25, 2024

12 ఎంపీ సీట్లిస్తే మెడలు వంచుతా: KCR

image

TG: BRSకు 12 ఎంపీ సీట్లు ఇస్తే కాంగ్రెస్ సర్కారు మెడలు వంచి, హామీలు అమలయ్యేలా చేస్తానని కేసీఆర్ అన్నారు. నిన్న మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించిన కేసీఆర్.. తెలంగాణకు మొదటి శత్రువు కాంగ్రెస్సేనని వ్యాఖ్యానించారు. తమ పదేళ్ల పాలనలో నాగార్జున సాగర్ ఆయకట్టుకు ఎలాంటి కొరత లేకుండా నీళ్లిచ్చామని, కాంగ్రెస్ దద్దమ్మలు ప్రాజెక్టును KRMBకి అప్పగించి, ఆయకట్టును ఎండబెట్టారని ఫైరయ్యారు.

Similar News

News April 15, 2026

పాడి రైతులు ఈ విషయం గుర్తుంచుకోవాలి

image

రోజుకు రెండు లీటర్లు పాలిచ్చే 5 ఆవులను పోషించే బదులు.. రోజుకు 10 లీటర్లు పాలిచ్చే ఒక సంకరజాతి ఆవును పోషించడం ఎంతో లాభసాటిగా ఉంటుందని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాడి పశువుల పోషణ వ్యయంలో 60 నుంచి 70 శాతం వ్యయం దాణా, గడ్డి, మందులకే ఖర్చవుతుంది. పాడి పరిశ్రమను లాభసాటిగా సాగించాలంటే పాడి పశువుల మేపుపై అదుపు, సంకరజాతి పశువుల పోషణపై సరైన అవగాహన కలిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

News April 15, 2026

ముగింపు దశలో యుద్ధం.. కానీ: ట్రంప్

image

ఇరాన్‌తో రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్‌తో యుద్ధం ముగింపు దశకు చాలా దగ్గరగా ఉందన్నారు. అయితే అమెరికా పని ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. ‘వారు ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడే మా బలగాలను ఉపసంహరించుకుంటే ఆ దేశాన్ని తిరిగి నిర్మించుకోవడానికి 20 ఏళ్లు పడుతుంది’ అని పేర్కొన్నారు.

News April 15, 2026

మరింత పెరగనున్న వాహనాల ధరలు?

image

నిర్వహణ ఖర్చులు పెరిగాయంటూ ఇప్పటికే ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ధరలు పెంచుతున్నాయి. యుద్ధం మరింత కాలం కొనసాగితే ఉత్పత్తి వ్యయం పరిమితికి మించి పెరిగి రేట్లు మరింత పెంచాల్సి రావొచ్చని భారత వాహన తయారీదారుల సమాఖ్య(సియామ్) అధ్యక్షుడు శైలేశ్ చంద్ర తెలిపారు. కమోడిటీ ధరలు ఏమేర పెరుగుతాయనేది 4-5 వారాల్లో స్పష్టత రావొచ్చన్నారు. ఆ తర్వాతే వాహనాల రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని వెల్లడించారు.