News November 8, 2025

NEEPCLలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

image

నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (<>NEEPCL<<>>) 30ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్ -2025 స్కోరు సాధించిన వారు ఈ నెల 17వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.50వేల నుంచి రూ.1,60,000 వరకు జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://neepco.co.in

Similar News

News January 17, 2026

RCB అభిమానులకు గుడ్‌‌న్యూస్

image

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్, ఇంటర్నేషనల్ మ్యాచులు నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ విషయాన్ని KA క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వ నిబంధనలు, షరతులకు లోబడి మ్యాచులు నిర్వహించుకోవాలని చెప్పినట్లు పేర్కొంది. కాగా గతేడాది ఆర్సీబీ ఐపీఎల్ కప్ గెలిచిన తర్వాత చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. అప్పటి నుంచి స్టేడియంపై నిషేధం ఉంది.

News January 17, 2026

మద్యం అమ్మకాల్లో వృద్ధి

image

TG: 2025 DEC నాటికి మద్యం అమ్మకాలు, ఆస్తి రిజిస్ట్రేషన్ల ఆదాయంలో రాష్ట్రం గణనీయ వృద్ధిని సాధించింది. ఆస్తి పన్ను వార్షిక లక్ష్యం ₹19,087CR కాగా 59.22% (₹11,304CR) సాధించినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. 2024లో ఇది కేవలం 41.28% మాత్రమే. ఎక్సైజ్ ఆదాయం ₹27,263 CR లక్ష్యంలో 63.38% (₹17,507CR) సాధించింది. 2024లో ఇది 54.96%. ఇక అమ్మకపు పన్ను 2024లో DEC నాటికి 71% సాధించగా ఈసారి అది 67.07%కి తగ్గింది.

News January 17, 2026

జపాన్‌ వెకేషన్‌లో అల్లు అర్జున్.. ఫ్యామిలీ పిక్ వైరల్

image

టోక్యోలోని సెన్‌సో-జి ఆలయానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. భార్య స్నేహా రెడ్డి, కొడుకు అయాన్, కూతురు అర్హతో దిగిన ఫోటోను SMలో ఆయన షేర్ చేశారు. షేర్ చేసిన క్షణాల్లోనే ఈ పిక్‌ను అభిమానులు వైరల్ చేసేశారు. సినిమాలు, ఫ్యామిలీకి సమానంగా టైమ్ కేటాయిస్తూ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటున్నారని కామెంట్స్ పెడుతున్నారు.