News July 5, 2024

నీట్ పీజీ పరీక్ష తేదీ ప్రకటన

image

నీట్ పీజీ 2024 పరీక్షను ఆగస్టు 11న నిర్వహించనున్నట్లు NBEMS ప్రకటించింది. రెండు షిప్టుల్లో పరీక్ష జరుగుతుందని, పూర్తి వివరాలకు https://natboard.edu.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది. నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా వివాదం నెలకొనడంతో గత నెల 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Similar News

News December 8, 2025

సూపర్ ఓవర్‌లో థ్రిల్లింగ్ విక్టరీ

image

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటకపై సూపర్ ఓవర్‌లో త్రిపుర థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తొలుత కర్ణాటక 20 ఓవర్లలో 197/6 స్కోర్ చేయగా, త్రిపుర 197/8 చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్‌లో TRI 22 రన్స్ చేయగా, KA 18/1 స్కోర్ మాత్రమే చేసి 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. త్రిపుర కెప్టెన్ మణిశంకర్ ఆల్‌రౌండ్(35 బంతుల్లో 69 పరుగులు, 2 వికెట్లు; సూపర్ ఓవర్‌లో 5 రన్స్, 1 వికెట్) ప్రదర్శనతో అదరగొట్టారు.

News December 8, 2025

AI నియంత్రణపై ఆస్ట్రేలియా ఫోకస్..

image

16 ఏళ్లలోపువారు SM వాడటంపై నిషేధం విధించిన ఆస్ట్రేలియా ఇప్పుడు AI నియంత్రణపై దృష్టి పెట్టింది. కొత్త చట్టాలు చేయకుండా, అమలులో ఉన్న చట్టాలతోనే AIతో వచ్చే సమస్యల పరిష్కారానికి 2026 నాటికి భద్రతా సంస్థ ఏర్పాటు చేయనుంది. టెక్నాలజీ అభివృద్ధితో పెరుగుతున్న సమస్యల పరిష్కారానికి సంస్థ పనిచేస్తుంది. డేటా సెంటర్లకు పెట్టుబడుల ఆకర్షణ, నైపుణ్యాభివృద్ధి, ప్రజాభద్రత టార్గెట్‌గా పెట్టుకున్నట్టు చెప్పింది.

News December 8, 2025

ఇతిహాసాలు క్విజ్ – 90 సమాధానం

image

ప్రశ్న: రామాంజనేయుల నడుమ యుద్ధమెందుకు జరిగింది?
సమాధానం: రాముని గురువు విశ్వామిత్రుడిని కాశీ రాజు యయాతీ అవమానించాడు. దీంతో యయాతిని చంపమని రాముడిని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. అటువైపు తన ప్రాణాలు కాపాడమని యయాతి ఆంజనేయుడిని శరణు వేడాడు. అలా ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆంజనేయుడు పలికిన రామనామం రాముని బాణాలు నిలవలేకపోయాయి. దీంతో విశ్వామిత్రుడు యుద్ధాన్ని ఆపి, యయాతిని క్షమించాడు. <<-se>>#Ithihasaluquiz<<>>