News June 17, 2024
నేపాల్ బౌలర్ల ధాటికి బంగ్లా విలవిల

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా కింగ్స్‌టౌన్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నేపాల్ బౌలర్లు దుమ్మురేపారు. 106 రన్స్‌కే ఆ జట్టును ఆలౌట్ చేశారు. బంగ్లా బ్యాటర్లలో షకీబ్(17 రన్స్)దే అత్యధిక స్కోరు. నేపాల్ బౌలర్లలో సోంపాల్, దీపేంద్ర, రోహిత్, సందీప్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓడితే బంగ్లా సూపర్-8 అవకాశాలు సంక్లిష్టమవుతాయి.
Similar News
News January 20, 2026
మెట్రో ఫేజ్-2: కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ లేఖ

TG: ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న మెట్రో ఫేజ్-2కు వీలైనంత త్వరగా అనుమతులు ఇప్పించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి CM రేవంత్ లేఖ రాశారు. ఇదే విషయమై కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. గతంలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌నూ కలిసినట్లు గుర్తుచేశారు. ఫేజ్-2 నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఇద్దరు అధికారులతో కూడిన సంయుక్త కమిటీ ఏర్పాటును CM లేఖలో ప్రస్తావించారు.
News January 20, 2026
సిట్ ఎన్నిసార్లు పిలిచినా వెళ్తా: హరీశ్ రావు

TG: సిట్ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వెళ్తానని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ‘విచారణకు పిలిచి గంట ప్రశ్నలు అడగడం.. కాసేపు ఫోన్ వచ్చిందని బయటకు వెళ్లడం చేశారు. కోల్ మైన్ విషయంలో రేవంత్, భట్టి, కోమటిరెడ్డి మధ్య పంపకాల్లో తేడా వచ్చింది. ఈ అంశం డైవర్ట్ చేయడానికే డ్రామా ఆడుతున్నారు. దర్యాప్తు పేరుతో ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారు. సీఎం రేవంత్ భాష వింటే రోత పుడుతోంది’ అని ఆయన అన్నారు.
News January 20, 2026
నం.3లో ఇషాన్ కిషన్ ఆడతారు: సూర్య

రేపు NZతో జరిగే తొలి T20లో ఇషాన్ కిషన్ నం.3లో బ్యాటింగ్ చేస్తారని కెప్టెన్ SKY తెలిపారు. శ్రేయస్ కంటే ముందే బ్యాటింగ్ చేయడానికి అతను అర్హుడన్నారు. మరోవైపు తన ఆటతీరులో మార్పు ఉండదని, గతంలో మాదిరే బ్యాటింగ్ చేయాలనుకుంటున్నానని చెప్పారు. రేపటి నుంచి NZతో IND 5 మ్యాచుల సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లో 7PMకు ప్రారంభమవుతుంది. JIO హాట్‌స్టార్, స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో LIVE చూడొచ్చు.


