News February 7, 2025

నేడు క్యాబినెట్‌లో కొత్త ఐటీ బిల్లుపై చర్చ, ఆమోదం!

image

1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త బిల్లు రూపకల్పన పూర్తయినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. దీనిపై ఇవాళ క్యాబినెట్‌లో చర్చించి ఆమోదించనున్నారని పేర్కొన్నాయి. వారంలో లోక్‌సభలో ప్రవేశపెడతారని చెప్పాయి. బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా కొత్త బిల్లుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అందరికీ అర్థమయ్యేలా IT రేట్లు, శ్లాబులు, TDS నిబంధనలు ఉంటాయని వెల్లడించారు.

Similar News

News February 17, 2026

కేయూ పీజీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల కాలపట్టికను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల విడుదల చేశారు. ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఈ నెల 25న మొదటి పేపర్, 27న రెండో పేపర్, మార్చి 2, 5, 7, 9 తేదీల్లో మిగిలిన పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షా సమయం ఉంటుందని పేర్కొన్నారు.

News February 17, 2026

డబ్బులే డబ్బుల్.. దేశంలో భారీగా క్యాష్ ట్రాన్సాక్షన్స్

image

దేశంలో డిజిటల్ పేమెంట్స్ జోరు కొనసాగుతున్నా ఇంకా నగదు చలామణి భారీగా ఉందని SBI లేటెస్ట్ రిపోర్ట్ తెలిపింది. JANలో రూ.40లక్షల కోట్లు చేతులు మారినట్లు పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఇది 11.1% ఎక్కువ. నగదు చలామణిలో 97.6% ప్రజల వద్దే నోట్ల రూపంలో ఉంది. నెలకు రూ.40లక్షల కంటే ఎక్కువ UPI లావాదేవీలు జరిపితే GST నోటీసులు, ఇన్‌కమ్ ట్యాక్స్ భయాలతో నగదు బదిలీ పెరిగినట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

News February 17, 2026

300కు 300 మార్కులు

image

JEE <<19159273>>మెయిన్‌లో<<>> AP జమ్మలమడుగుకు చెందిన పసల మోహిత్ 100 పర్సంటైల్‌తో 300కు 300 మార్కులు సాధించారు. రోజుకు 4 గంటలే చదివానని, ర్యాంకుల కోసం ఒత్తిడి లేకపోవడంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. విజయవాడలో ఇంటర్ చదివిన అతడు IIT బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. మోహిత్ తండ్రి కిరణ్ కుమార్ ప్రొద్దుటూరులో వైద్యుడిగా పనిచేస్తుండగా, తల్లి సబిత జమ్మలమడుగులోని ప్రభుత్వ ఆసుపత్రిలో డెంటిస్ట్.