News April 2, 2024
OTTలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా?

‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ నటించిన ఇంట్రెస్టింగ్ అడ్వెంచర్ సినిమా ‘గామి’ OTT స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. తాజా అప్‌డేట్ ప్రకారం ఏప్రిల్ 12న జీ 5 OTTలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. కాగిత విద్యాధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అభినయ, సమద్ తదితరులు నటించారు.
Similar News
News February 12, 2026
44 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

UPSC 44 ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BSc (స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్), MA, MSc అర్హత గలవారు మార్చి 3 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://upsconline.nic.in
News February 12, 2026
దోస పంటలో బోరాన్ లోప నివారణకు సూచనలు

దోస పంటలో బోరాన్ లోప లక్షణాలను గమనిస్తే లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అవసరాన్ని బట్టి ఎకరాకు 10 కిలోల బోరాక్స్‌ను దుక్కిలో వేసుకోవాలి. దీని వల్ల పంటలో మగ పువ్వులు తగ్గి దిగుబడిని పెంచే ఆడ పువ్వుల సంఖ్య పెరుగుతుంది. దీని వల్ల ఆశించిన దిగుబడి సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
News February 12, 2026
ఇకపై స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులు

AP: గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డులుగా మార్చింది. ఇటీవల మంత్రివర్గం తెలిపిన ఆమోదం మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన విషయం తెలిసిందే.


